Sakshi Mock EAPCET & NEET Question Paper With Key 2024 : ‘సాక్షి’ మాక్ ఈఏపీసెట్‌కు విశేష స్పందన.. కొశ్చన్ పేపర్ & 'కీ' క్లిక్ చేయండి
ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ టెస్టు వల్ల తాము ఎంత వరకు చదువుకున్నాం.. ఏఏ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.. ఏ ప్రశ్నలకు ముందుగా జవాబు రాయాలి.. పరీక్షను ఎదుర్కొనే విధానం.. సమయపాలన వంటి అంశాలపై అవగాహన కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సాక్షి మాక్ ఏపీఈఏపీసెట్–2024, సాక్షి మాక్ నీట్-2024 కొశ్చన్ పేపర్, 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
☛ సాక్షి మాక్ ఏపీఈఏపీసెట్–2024, నీట్–2024 కొశ్చన్ పేపర్ & 'కీ' క్లిక్ చేయండి
ఆందోళన దూరమైంది.. : ఎం.యామిని, యలమంచిలి
ఏపీఈఏపీసెట్ మాక్ పరీక్ష రాయడం వల్ల నాలో ఆందోళన దూరమైంది. సహజంగా ఆన్‌లైన్ పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరీక్ష కారణంగా ఒత్తిడి నుంచి దూరం కావడం ఎలాగో కిటుకు తెలిసింది. ఇప్పుడు మెయిన్ పరీక్షను ఉత్సాహంగా ఎదుర్కొంటా.
పరీక్షపై అవగాహన పెరిగింది : బి.చరణ్, మాడుగుల
ఏపీఈఏపీసెట్ రాసే విధానంపై పూర్తిగా అవగాహన కలిగింది. మాక్ టెస్ట్ నిర్వహించిన సాక్షి మీడియా గ్రూప్, ఐసీఎఫ్‌ఏఐ విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు. పరీక్షలో ఆందోళన చెందకుండా నాలాంటి విద్యార్థులకు ఇలాంటి మాక్ టెస్టులు దోహదపడతాయి.
సమయపాలనపై అవగాహన : ఎం.జోషిక, సబ్బవరం
ఏపీఈఏపీసెట్ మాక్ పరీక్ష రాయడం వల్ల సమయపాలనపై అవగాహన పెరిగింది. ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించాలో తెలిసింది. ఇలాంటి పరీక్షలు తరచూ అన్ని పోటీ పరీక్షలకు నిర్వహిస్తే బాగుంటుంది. నిర్వాహకులకు కృతజ్ఞతలు.
డిఫరెంట్‌గా మాక్ టెస్ట్ : ఎ.హర్షిత, కోల్‌కతా
ఇంటర్మీడియట్‌లో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఏపీఈఏపీసెట్‌కు ప్రిపేరవుతూ ఎన్నో మోడల్ పేపర్లు ఆన్సర్ చేశాను. సాక్షి మాక్ టెస్టు చాలా డిఫరెంట్‌గా ఉంది. సిలబస్ పార్టు బాగా కవర్ చేశారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు.
కొండంత ధీమా కలిగింది.. : ఆర్.రోషిణి, విజయనగరం
మాక్ టెస్ట్ నిర్వహణ చాలా బాగుంది. ఈ పరీక్ష రాయడం వల్ల నాలో కొండంత ధీమా కలిగింది. ఇప్పుడు ఏపీఈఏపీసెట్‌ను ఎదుర్కోగలను. మంచి ర్యాంకు సాధించగలననే భరోసా కలిగింది.
మంచి తోడ్పాటు.. : పి.రవిశంకర్, బొబ్బిలి
ఏపీఈఏపీసెట్‌ను ధైర్యంగా ఎదుర్కోగల సత్తా సాక్షి మాక్ టెస్టు ద్వారా లభించింది. నాలాంటి ఎందరో విద్యార్థులకు వీలుగా మాక్ టెస్ట్ నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు. పరీక్ష ఎలా ఉంటుందో ముందే అవగాహన పొందగలిగాం.
మంచి మార్కులకు సూచిక : బి.జలంధర్, తుని
మాక్ టెస్టు బాగా రాశాను. దీనిని బట్టి నేను ఇంకా మంచి మార్కులు సాధించుకోవడానికి ఏం చేయాలో తెలిసింది. మ్యాథ్స్ 2బీ ఇంకా ప్రిపేర్ కావడానికి సూచికగా ఈ టెస్టు ఉపయోగపడింది.
సన్నద్ధతకు సరైన మార్గదర్శి..: ఎం.వెన్నెల, బొబ్బిలి
నేను ఏపీఈఏపీసెట్‌కు కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను. సాక్షి మాక్ టెస్టు వల్ల నేను ప్రిపేర్ అయిన సిలబస్ చెక్ చేసుకోవడానికి ఉపయుక్తంగా నిలిచింది. మంచి ర్యాంకు సాధించగలననే నమ్మకం వచ్చింది.
ప్రశ్నాపత్రం రూపకల్పన బాగుంది..: ఎం.వి.ఎస్.జ్యోత్స్న, విజయనగరం
సాక్షి మాక్ టెస్టుకు రూపొందించిన ప్రశ్నాపత్రం రూపకల్పన బాగుంది. వచ్చే నెలలో జరగనున్న ఏపీఈఏపీసెట్‌కు ఇవే ప్రశ్నలు వస్తాయా అనేలా ఉంది. ఏఏ సబ్జెక్టుల నుంచి ఏఏ ప్రశ్నలు వస్తాయో నిశితంగా పరిశీలించి సెట్ చేసినట్టు ఉంది.
మాకెంతో మేలు..: డి.జాహ్నవి, సోంపేట
సాక్షి మాక్ టెస్టు ద్వారా ఏపీఈఏపీసెట్ పరీక్ష విధానం ముందుగానే తెలిసింది. మిగిలిన రోజులు మరింతగా సబ్జెక్టుపై పట్టు సాధించడానికి, ఉత్తమ ర్యాంక్ సాధించడానికి మాక్‌టెస్ట్ ఎంత గానో ఉపయోగపడింది.
Tags
- Sakshi EAPCET 2024
- Sakshi Mock NEET 2024
- Sakshi EAPCET 2024 Mock Test
- Sakshi EAPCET Engineering Mock Exam 2024 Question Paper with Key
- Sakshi NEET 2024 Mock Test
- Sakshi Mock NEET 2024 Details
- sakshi mock neet 2024 key
- sakshi mock neet 2024 key question paper with key
- sakshi eapcet 2024 key released
- Sakshi Eamcet Mock Tests
- sakshi eamcet mock test 2024
- sakshi neet mock test 2024 dates