Skip to main content

Sakshi EAPCET & NEET Mock Test 2024 : సాక్షి మీడియా ఆధ్యర్యంలో ఈఏపీసెట్‌, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌ . అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.
Access Mock Test Facility for EAPSET Preparation   Sakshi EAPCET and NEET Mock Test 2024    Mock Test Opportunity     Online Mock Tests for EAPSET

అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్‌  కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్‌, నీట్‌ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. టెక్నాలజీ పాట్నర్‌గా మై ర్యాంక్‌ వ్యవహారిస్తున్నది. 

వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో..

పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌  స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.arenaone.in/mock ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌  ఫీజు రూ.250/–.  రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్‌ 22 చివరి తేదీ. రిజిస్టర్‌ చేసుకున్న ఈమెయిల్‌కు పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్‌ నెంబర్‌  వస్తుంది.

పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను..

ఏప్రిల్ 27వ తేదీన‌ నీట్, ఏప్రిల్ 28న EAPCET అగ్రికల్చర్,ఇంజనీరింగ్ పరీక్షలుంటాయి. ఈ ఆన్‌లైన్‌ టెస్ట్ 9AM - 6PM వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్షా సమయం 3:00 గంటలు.  ఈ పరీక్షలను మీ యూజర్‌ నేమ్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌ (యూజర్‌ నేమ్‌), ఫోన్‌ నెంబర్‌ (పాస్‌వర్డ్‌)తో ఇచ్చిన సమయంలో ఎప్పుడైన లాగ్‌ఇన్‌ అయ్యి రాసుకోవచ్చు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా మీరు చూసుకోవచ్చు.   మాక్‌ పరీక్షలను  https://sakshimocktest.myrank.co.in వెబ్‌సైట్‌లో నిర్వహిస్తారు. టెస్ట్‌కి సంబంధించిన ’కీ’ ని ఏప్రిల్‌ 30వ తేదీన ఇదే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 95055 14424, 96660 13544, 96665 72244.

Published date : 23 Mar 2024 03:34PM

Photo Stories