Skip to main content

EAMCET/AP EAPCET 2023: ఇలా చేస్తే.. టాప్‌ ర్యాంక్‌ ఖాయం

ఇంజనీరింగ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం! ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విద్యార్థులు అధిక శాతం మంది ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో టీఎస్‌ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటోంది. అలాగే ఇంటర్మీడియెట్‌ బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు వీలుగా ఈ ఎంట్రెన్స్‌లు రాస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బెస్ట్‌ ర్యాంకుకు నిపుణుల సలహాలు...
EAMCET/AP EAPCET 2023
  • మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్‌; మే 10 నుంచి టీఎస్‌ ఎంసెట్‌
  • ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశం
  • తెలంగాణలో బీఎస్సీ (నర్సింగ్‌)కు కూడా ఎంసెట్‌ ర్యాంకే ఆధారం
  • కాన్సెప్ట్‌లపై పట్టుతోనే బెస్ట్‌ ర్యాంకు అంటున్న నిపుణులు

చదవండి: TS EAMCET and AP EAPCET Previous Papers

ఇంటర్మీడియెట్‌ (ఎంపీసీ/బైపీసీ) అర్హతగా బీటెక్, అగ్రికల్చర్‌ అనుబంధ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రిలక్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఈఏపీసెట్‌)గా; తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎంసెట్‌)గా ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

జేఈఈకి పోటీ పడుతున్న విద్యార్థులు సైతం ఈఏపీసెట్, ఎంసెట్‌లకు సన్నద్ధమవుతుంటారు. దీంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంటోంది. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే మంచి ర్యాంకు సొంతం చేసుకోచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

చదవండి: Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

ఏపీలో కోర్సులు ఇవే

  • ఏపీలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో.. ఇంజనీరింగ్, బ యో టెక్నాలజీ, బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌),బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
  • అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో.. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌ కోర్సులు ఉన్నాయి.
  • ఫార్మసీ విభాగంలో.. బీ-ఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సులున్నాయి. 

తెలంగాణలో కోర్సులు

  • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో.. బీఈ/బీటెక్, బీటెక్‌ బయో టెక్నాలజీ, బీటెక్‌(డైరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. 
  • అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌లో.. బీఎస్సీ అగ్రికల్చర్‌(ఆనర్స్‌), బీఎస్సీ హార్టికల్చర్‌ (ఆనర్స్‌), బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, ఫార్మ్‌ డీ కోర్సులున్నాయి. 
  • తెలంగాణలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌లో అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ ర్యాంకును పరిగణనలోకి తీసుకోనున్నారు.
  • ఫార్మసీ కోర్సులకు సంబంధించి 50 శాతం సీట్లను ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ర్యాంకు ఆధారంగా, మరో 50 శాతం సీట్లను ఫార్మసీ/మెడిసిన్‌ స్ట్రీమ్‌ ర్యాంకుతో భర్తీ చేస్తారు.

చదవండి: ఎంసెట్‌లో సత్తా చాటేలా.. ప్రిపరేషన్‌ సాగించండిలా..

పరీక్ష సిలబస్‌

ఈ ఏడాది ఈఏపీసెట్, ఎంసెట్‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం సిలబస్‌లో 70 శాతం సిలబస్‌నే ఎంట్రన్స్‌ సిలబస్‌గా పేర్కొన్నారు. 2021-22లో మొదటి సంవత్సరం విద్యార్థులకు కోవిడ్‌ కారణంగా 30 శాతం సిలబస్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 160 మార్కులకు పరీక్ష

  • ఏపీ ఈఏపీసెట్, టీఎస్‌ ఎంసెట్‌.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌/ఫార్మసీ స్ట్రీమ్‌లకు వేర్వేరుగా.. మొత్తం 160 మార్కులకు నిర్వహించనున్నారు. 
  • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో.. మ్యాథమెటిక్స్‌ నుంచి 80; ఫిజిక్స్‌ నుంచి 40; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతుంది. 
  • అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌లో.. బయాలజీ(బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్‌ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.

చదవండి: EAMCET Practice Questions

ప్రిపరేషన్‌ ఇలా
మ్యాథమెటిక్స్‌కు 50 శాతం వెయిటేజీ

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ఎంట్రన్స్‌లో 50 శాతం వెయిటేజీ ఉన్న సబ్జెక్ట్‌ మ్యాథమెటిక్స్‌. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తొలుత ప్రాథమిక సూత్రాలపై పట్టుసాధించాలి. త్రికోణమితిలో సూత్రాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని సరైన చోట అన్వయించగలిగేలా ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు విద్యార్థులు వేగం, కచ్చితత్వంపై దృష్టి సారించాలి.
ముఖ్య చాప్టర్లు: ఇంటర్‌ మ్యాథ్స్‌ సిలబస్‌ను ఆల్‌జీబ్రా, కాల్కులస్, జామెట్రీ, వెక్టార్‌ ఆల్‌జీబ్రా, ట్రిగనోమెట్రీగా విభజించొచ్చు. విద్యార్థులు బోర్డు పరీక్షల కోణంలో లిమిట్స్‌ అండ్‌ కమ్యూనిటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్‌ ఆఫ్‌ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డిఫైనెట్‌ ఇంటెగ్రల్, డిఫెరెన్షియెల్‌ ఈక్వేషన్స్‌పై దృష్టిపెట్టి ఉంటారు. జామెట్రీలో 2డీ, 3డీ జ్యామెట్రీ, లోకస్, ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సెస్, స్రై ్టట్‌ లైన్స్, సర్కిల్, సిస్టమ్‌ ఆఫ్‌ సర్కిల్స్, పారాబోలా, ఎల్లిప్స్, డైరక్షన్‌ కొసైన్స్, డైరక్షన్‌ రేషియోస్, ప్లేన్‌ తదితరాలు కీలక అంశాలుగా ఉంటాయి. అదే విధంగా ఆల్‌జీబ్రాలో ఫంక్షన్లు, మ్యాథమెటికల్‌ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్‌ నంబర్స్, డిమోవియర్స్‌ థీరమ్, క్వాట్రాడిక్‌ ఎక్స్‌ప్రెషన్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, బైనామియల్‌ థీరమ్‌ తదితరాలపై ఫోకస్‌ పెట్టాలి. ట్రిగనోమెట్రిలో ట్రిగనోమెట్రి రేషియోస్‌ అప్‌టు ట్రాన్స్‌ఫర్మేషన్స్, ట్రిగనోమెట్రిక్‌ ఈక్వేషన్స్, ఇన్వెర్స్‌ ట్రిగనోమెట్రిక్‌ ఫంక్షన్స్, హైపర్‌బోలిక్‌ ఫంక్షన్స్, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ట్రయాంగల్‌ టాపిక్స్‌ను సమగ్రంగా ప్రిపర్‌ కావాలి. వెక్టర్‌ ఆల్‌జీబ్రా నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వస్తున్నాయి. అడిషన్‌ ఆఫ్‌ వెక్టర్స్, ప్రొడక్ట్‌ ఆఫ్‌ వెక్టర్స్, మెజర్స్‌ ఆఫ్‌ డిస్పెర్షన్‌ అండ్‌ ప్రాబబిలిటీలో.. మెజర్స్‌ ఆఫ్‌ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్‌ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌పై పట్టు సాధించాలి.
-ఎం.ఎన్‌.రావు, సబ్జెక్ట్‌ నిపుణులు

చదవండి: EAMCET Quick Review

ఫిజిక్స్‌పై పట్టు కీలకం

ఈ విభాగంలో కొంచెం ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశం.. హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌. ఈ చాప్టర్‌ నుంచి దాదాపు పది ప్రశ్నలు అడిగే అవకాశముంది. దీని తర్వాత వర్క్‌ ఎనర్జీ పవర్, సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికల్స్‌ అండ్‌ రొటేషనల్‌ మోషన్, లాస్‌ ఆఫ్‌ మోషన్, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్, మూవింగ్‌ చార్జెస్‌ అండ్‌ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రావిటేషన్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్‌ పొటెన్షియెల్‌ అండ్‌ కెపాసిటెన్స్‌పై నాలుగు ప్రశ్నల చొప్పున అడిగే అవకాశం ఉంది. వీటి తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఇండక్షన్, రే ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్‌ కరెంట్, వేవ్‌ ఆప్టిక్స్, మోషన్‌ ఇన్‌ ఎ స్రై ్టట్‌ లైన్, మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్‌ చార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్, డ్యూయెల్‌ నేచర్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ మేటర్, న్యూక్లిౖయె, సెమికండక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టిపెట్టాలి. పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఉంటున్న మెకానిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, మోడ్రన్‌ ఫిజిక్స్‌ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
-రవీంద్ర, సబ్జెక్ట్‌ నిపుణులు

చదవండి: EAMCET Bitbank

కెమిస్ట్రీ కొంత సులభమే

విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్‌.. కెమిస్ట్రీ. ఫిజికల్‌ కెమిస్ట్రీలో.. సొల్యూషన్స్‌ చాప్టర్‌ నుంచి ప్రధానంగా ప్రాబ్లమ్‌ బేస్డ్‌ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతోపాటు రౌల్ట్స్‌ లా, ఐడియల్, నాన్‌ ఐడియల్‌ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మొలారిటీ, మొలాలిటీ, వేపర్‌ ప్రెజర్‌ ఆఫ్‌ లిక్విడ్‌ సొల్యూషన్స్‌ తదితరాలపై దృష్టిపెట్టాలి. సాలిడ్‌స్టేట్‌లో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ క్రిస్టలైన్‌ సాలిడ్స్, ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ, బ్యాండ్‌ థియరీ ఆఫ్‌ మెటల్స్, మ్యాగ్నెటిక్‌ ప్రాపర్టీస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్‌లో నెర్ట్స్‌ ఈక్వేషన్‌పై ప్రాబ్లమ్‌ బేస్డ్‌ ప్రశ్నలు, ఎలక్ట్రాలసిస్‌ రిలేటెడ్‌ ప్రాబ్లమ్స్‌పై ఫోకస్‌ పెట్టాలి. గ్రూప్‌ మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్‌ పాయింట్లు, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగిటివిటీ, ఫస్ట్‌ ఆర్డర్‌ రియాక్షన్, టైప్స్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్, స్టాండర్డ్‌ రిడక్షన్, పొటెన్షియల్‌ వాల్యూమ్‌ టాపిక్స్‌పై దృష్టిపెట్టాలి. బోరాక్స్, డైబోరేన్‌ స్ట్రక్చర్, ప్రిపరేషన్, ప్రాపర్టీస్, డైమండ్, రాఫైట్‌ స్ట్రక్చర్లు, సిలికాన్ల గురించి క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు డి, ఎఫ్‌-బ్లాక్‌ ఎలిమెంట్లు, స్టాండర్డ్‌ రిడక్షన్‌ పొటెన్షియల్‌ వాల్యూ, వెస్పర్‌ థియరీ తదితరాలపై ఫోకస్‌ పెట్టాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి. ఇందులో హైడ్రోకార్బన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, హోమోజినైజేషన్, రియాక్షన్‌ విత్‌ బేయర్స్‌ రియేజెంట్, హాలోజన్, ఎస్‌ఎల్‌ మెకానిజమ్స్, యా­సిడ్‌ స్ట్రెంత్‌ ఆఫ్‌ ఫీనాల్స్, కార్బాక్సిలిక్‌ యాసిడ్స్, అమైన్స్‌పై దృష్టిపెట్టాలి. కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీలుగా విభజించుకొని చదవాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో పట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
-విజయ్‌ కిశోర్, సబ్జెక్ట్‌ నిపుణులు

చదవండి: Model papers

బోటనీ

డైవర్సిటీ ఇన్‌ ది లివింగ్‌ వరల్డ్, స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్స్‌ ఇన్‌ ప్లాంట్స్‌(మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్‌ ఇన్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ సిస్టమాటిక్స్, సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్, ఇంటర్నల్‌ ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ ఎకాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ (బ్యాక్టీరియా, వైరస్‌), జెనిటిక్స్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో టెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్‌ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
-బి.రాజేంద్ర, సబ్జెక్ట్‌ నిపుణులు

జువాలజీ

డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ వరల్డ్, స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ యానిమల్స్, యానిమల్‌ డైవర్సిటీ, లోకోమోషన్‌ అండ్‌ రీప్రొడక్షన్‌ ఇన్‌ ప్రొటొజోవా, బయాలజీ అండ్‌ çహ్యూమన్‌ వెల్ఫేర్, స్టడీ ఆఫ్‌ పెరిప్లెనేటా అమెరికానా, ఎకోలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ, హ్యూమన్‌ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్‌ ఎవల్యూషన్, అప్లయిడ్‌ బయాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి.
-కె.శ్రీనివాసులు, సబ్జెక్ట్‌ నిపుణులు

చదవండి: TS EAMCET and AP EAPCET Previous Papers

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ

  • ఎంసెట్, ఈఏపీసెట్‌లకు ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • ప్రాబ్లమ్స్‌ ప్రాక్టీస్‌ చేసేటప్పుడు దానికి సంబంధించిన సూత్రాలపై అవగాహనతో అడుగులు వేయాలి.
  • ఒక కాన్సెప్ట్‌కు చెందిన ప్రశ్నను భిన్న కోణాల్లో సాధించేందుకు కృషి చేయాలి.
  • ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు ప్రిపరేషన్‌ సమయం కేటాయించాలి.
  • విద్యార్థులు ప్రతి చాప్టర్‌లోని సినాప్సిస్‌పై పట్టు సాధించాలి.

ఏపీ ఈఏపీసెట్‌-2023 ముఖ్య తేదీలు

  • ఈఏపీ-సెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 15 నుంచి మే 19 వరకు; 
  • అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 22, 23 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

చదవండి: EAMCET Practice Questions

టీఎస్‌ ఎంసెట్‌ 2023-ముఖ్య సమాచారం

  • టీఎస్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 12, 13, 14
  • అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: మే 10, 11 తేదీల్లో
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/
Published date : 08 May 2023 06:57PM

Photo Stories