Skip to main content

ఎంసెట్‌లో సత్తా చాటేలా.. ప్రిపరేషన్‌ సాగించండిలా..

ఎంసెట్‌లో సత్తా చాటి కోరుకున్న కాలేజీ, బ్రాంచ్‌లో/కోర్సులో ప్రవేశం పొందాలని లక్షలాది మంది ఉవ్విళ్లూరుతుంటారు. కాగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. టీఎస్‌ ఎంసెట్‌–2021కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టిపెడుతున్నారు.

టాప్‌ ర్యాంకే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. ఎంసెట్‌లో విజయానికి హార్డ్‌వర్క్‌తోపాటు సమయ పాలన, ప్రిపరేషన్‌ వ్యూహాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు ఉపయోగపడేలా నోటిఫికేషన్‌ సమాచారంతోపాటు సబ్జెక్టుల వారీగా ఫ్యాకల్టీ అందిస్తున్న ప్రిపరేషన్‌ టిప్స్‌..
కోర్సులు..
టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌(డైరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హస్బండ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్, బీఫార్మసీ, ఫార్మడీ(డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష స్వరూపం..
ఎంసెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో మొత్తం 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు లేవు.
ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌..
సబ్జెక్టు ప్రశ్నలు మ్యాథమెటిక్స్‌ 80 ఫిజిక్స్‌ 40 కెమిస్ట్రీ 40 మొత్తం 160 అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌.. సబ్జెక్టు ప్రశ్నలు బయాలజీ(బోటనీ+జువాలజీ) 40+40=80 ఫిజిక్స్‌ 40 కెమిస్ట్రీ 40 మొత్తం 160 ప్రిపరేషన్‌ టిప్స్‌..
ప్రిపరేషన్‌ పరంగా చదవడంతోపాటు ప్రాక్టీసుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పాత ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను సాధించాలి.
ప్రతి రోజూ కనీసం 100 ప్రశ్నలను సాధన చేయాలి. ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న తప్పులను విశ్లేషించాలి. కష్టంగా అనిపించే ప్రశ్నలను గుర్తించి... రివిజన్‌లో వాటిపై దృష్టి సారించాలి. సులభంగా ఉన్న ప్రశ్నలను సైతం రివిజన్‌ చేయాలి. ఆరోగ్యం.. పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు శారీరక, మానసిక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలి. మంచి సమతుల ఆహారం తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరు నుంచి ఏడు గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. ప్రిపరేషన్‌ పరంగా సానుకూలతను ప్రదర్శించాలి. తద్వారా పరీక్ష పరంగా ఆశించిన ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని అతివిశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని గుర్తించాలి. మాక్‌ టెస్టులు.. రోజూ మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పరీక్ష పరంగా స్వీయ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. మాక్‌టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్‌ వ్యూహాలను మార్చుకోవాలి. ఫిజిక్స్‌.. ప్రథమ సంవత్సరంలోని సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికల్స్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ నుంచి 2 ప్రశ్నలు, థర్మోడైనమిక్స్‌ నుంచి 2–3 ప్రశ్నలు, యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్‌ నుంచి 2 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ద్వితీయ సంవత్సరంలో ఎలక్ట్రిసిటీ నుంచి 4–5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీలో కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమ్యాగ్నటిజం,ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ఇండక్షన్‌పై దృష్టిపెట్టాలి. మోడ్రన్‌ ఫిజిక్స్‌లో.. ఆటమ్స్, న్యూక్లిౖయె, సెమికండక్టర్స్, డ్యూయల్‌ నేచుర్‌ ఆఫ్‌ రేడియేషన్‌ టాపిక్స్‌ నుంచి 4ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. రేఆప్టిక్స్, వేవ్‌ ఆప్టిక్స్‌లో క్యాల్కులేషన్స్‌పై దృష్టి పెట్టాలి. ఫిజిక్స్‌లో పాఠ్యాంశాలు అంతర్గత అనుసంధానంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అన్ని ఛాప్టర్లను సమగ్రంగా చదవాలి. క్యాల్కులేషన్‌ ప్రశ్నలకు సంబంధించి అప్రాక్సిమేషన్, ఎలిమినేషన్‌ మెథడ్స్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ప్రశ్నను రిపీటెడ్‌గా చదవడం వల్ల విద్యార్థులు సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నపత్రం చదువుతూ వెళ్లి సులభంగా అనిపించిన ప్రశ్నలను ముందు అటెంప్ట్‌ చేయాలి. జేఈఈ మెయిన్‌ అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఎంసెట్‌ ప్రధానంగా మెమొరీ బేస్డ్‌గా ఉంటుంది. కాబట్టి ప్రతి చాప్టర్‌ నుంచి 10–15 ఫార్ములాలను నేర్చుకుంటే పరీక్ష పరంగా లాభిస్తుంది. - ఎ. కృష్ణారెడ్డి, సీనియర్‌ ఫ్యాకల్టీ. మ్యాథమెటిక్స్‌.. ప్రథమ సంవత్సరంలో స్రైట్‌ లైన్, వెక్టార్స్, డైరెక్షన్‌ కొసైన్స్‌–డైరెక్షన్‌ రేషియోస్, ఫంక్షన్స్, ట్రిగనోమెట్రి ఛాప్టర్లను కీలకంగా భావించాలి. ట్రిగనోమెట్రి చాప్టర్‌ నుంచి 10–12 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ద్వితీయ సంవత్సరంలో సర్కిల్స్, సిస్టమ్‌ ఆఫ్‌ సర్కిల్స్‌ నుంచి ఆరు నుంచి ఏడు ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని ఛాప్టర్లను తొలగించినందున ఈ సంవత్సరం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తర్వాత క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్, ఇంటెగ్రల్‌ అండ్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్‌ వేరియబుల్స్‌ కీలకంగా భావించాలి. ఎంసెట్‌ మ్యాథ్స్‌ ప్రశ్నలు కొంచెం లెంగ్తీగా ఉంటాయి. మ్యాథ్స్‌ పరంగా ఫస్టియర్‌ కొంత సులభంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఫస్టియర్‌కు 55 శాతం వెయిటేజీ కల్పించడం విద్యార్థులకు లాభించే అంశమే. – ఎం.ఎన్‌.రావు, సీనియర్‌ ఫ్యాకల్టీ జువాలజీ.. ప్రథమ సంవత్సరంలో వానపాము, బొద్దింక, అకశేరుకాలు, జంతు కణజాలాలపై దృష్టిపెట్టాలి. బొద్దింకపై 4 లేదా 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎకాలజీ, ఓజోన్, వాతావరణ కాలుష్యం, మానవుడికి వచ్చే వ్యాధులు–కారణాలను చదవాలి. లోకోమోషన్‌ అండ్‌ రీప్రొడక్షన్‌ ఇన్‌ ప్రొటొజోవా..చిన్న పాఠ్యాంశమైనా రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ద్వితీయ సంవత్సరంలో మానవుడి అంతర నిర్మాణం చాప్టర్‌ నుంచి 10 ప్రశ్నలు వరకు వస్తాయి. హ్యూమన్‌ ఫిజియాలజీలో కొంత భాగాన్ని తొలగించారు. అభ్యర్థులు తొలగించిన సిలబస్‌ను చదవాల్సిన అవసరం లేదు. వీటి తర్వాత బయోమెడికల్‌ టెక్నాలజీ కీలకం. మనుషుల్లో హార్మోన్స్‌ లోపిస్తే వచ్చే వ్యాధులపై దృష్టిపెట్టాలి. మొత్తంగా ప్రథమ సంవత్సరంలో బయాలజీ–హ్యూమన్‌ వెల్ఫేర్, మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్, కాక్రోచ్, ద్వితీయ సంవత్సరలో.. హ్యూమన్‌ ఫిజియాలజీ,జెనిటిక్స్,బయోమెడికల్‌ టెక్నాలజీ ఛాప్టర్లకు అధిక వెయిటేజీ లభించే అవకాశం ఉంది. – కె.శ్రీనివాసులు, సీనియర్‌ ఫ్యాకల్టీ బోటనీ.. ప్రథమ సంవత్సరంలో మార్ఫాలజీ, అనాటమీ, రీప్రొడక్షన్, ఎకాలజీ ఛాప్టర్లను; ద్వితీయ సంవత్సరంలో ఫిజియాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ వెల్ఫేర్‌ టాపిక్స్‌ను కీలకంగా భావించాలి. డైవర్సిటీ ఇన్‌ ది లివింగ్‌ వరల్డ్, స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్స్‌ ఇన్‌ ప్లాంట్స్‌(మార్ఫాలజీ), ప్లాంట్‌ సిస్టమాటిక్స్, సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్, ఇంటర్నల్‌ ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ ఎకాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, మైక్రో బయాలజీ (బ్యాక్టీరియా, వైరస్‌), జెనిటిక్స్, మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్‌పై ఎక్కువగా ప్రశ్నలొస్తున్నాయి. ఎంసెట్‌ పరంగా బోటనీ సులభంగానే ఉంటుంది. విద్యార్థులు సాధ్యమైనన్ని మాక్‌ టెస్టులకు హాజరైతే బోటనీలో ఎక్కువ మార్కులు పొందొచ్చు. పండరి, సీనియర్‌ ఫ్యాకల్టీ కెమిస్ట్రీ.. స్టాకియోమెట్రి, స్టేట్స్‌ ఆఫ్‌ మేటర్, అటామిక్‌ స్ట్రక్చర్, కెమికల్‌ బాండింగ్‌లను కీలక ఛాప్టర్లుగా భావించాలి. వీటి తర్వాత కెమికల్‌ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, ఐయానిక్‌ ఈక్విలిబ్రియం చాప్టర్ల నుంచి 5 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఆర్గానిక్‌లో హైడ్రోకార్బన్స్‌ నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్గానిక్‌ జనరల్‌ ఇంట్రడక్షన్‌పైనా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. గ్రూప్స్‌లో ఎక్కువగా 3,4 గ్రూపులపై ప్రశ్నలు అడుగుతున్నారు. గత మూడేళ్ల పేపర్లను పరిశీలిస్తే.. జేఈఈ మెయిన్‌ పేపర్‌ కంటే ఎంసెట్‌ పేపర్‌ కఠినంగా ఉందని చెప్పొచ్చు. ఎంసెట్‌ పరంగా అభ్యర్థులు ముందుగా కెమిస్ట్రీని అటెంప్ట్‌ చేయాలి. కెమిస్ట్రీలో అడిగే 40 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు చూడగానే సమాధానాలు గుర్తించేలా ఉంటాయి. కానీ, ప్రశ్నలను సమగ్రంగా చదవకుండా తప్పులు చేస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ, అకాడమీ పుస్తకాలను కనీసం రెండుసార్లు అధ్యయనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్గానిక్‌ పరంగా వీలైనన్ని ఎక్కువ బిట్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. ఫిజికల్, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలపై ఎక్కువ దృష్టిపెట్టడం లాభిస్తుంది. రామానుజం, సీనియర్‌ ఫ్యాకల్టీ ముఖ్యసమాచారం.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 18.05.2021 ఫీజు: ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్‌: రూ.800. ఎస్సీ/ఎస్టీ /పీహెచ్‌లకురూ.400. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx చ‌ద‌వండి: టీఎస్ ఎంసెట్ 2021: అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌లలో ముందుగా ఏ పరీక్ష నిర్వహించేది? Published

Published date : 26 Jun 2021 02:03PM

Photo Stories