TS EAPCET 2024: రేపే టీఎస్ ఎంసెట్.. ఇవి ఉంటేనే లోపలికి అనుమతి, ముఖ్యమైన సూచనలు
Sakshi Education
రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఈఏపీసెట్ (ఎంసెట్) ప్రవేశపరీక్షలు రేపటి నుంచి జరగనున్నాయి. ఇప్పటికే వీటికోసం ఉన్నత విద్యామండలి సర్వం సిద్ధం చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు ఉంటాయి.
ముఖ్యమైన సూచనలు...
- పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటాయి.
- బయోమెట్రిక్ హాజరుకు 20 నిమిషాల సమయం పడుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
- వేలికి ఎలాంటి మెహిందీ, టాటూస్, ఇంక్ వంటివి అంటించుకోకూడదు. ఇది బయోమెట్రిక్‌కు ఇబ్బంది కల్గిస్తుంది.
- పరీక్ష హాల్లోకి బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్, హాల్ టికెట్, అవసరమైన ధ్రువపత్రాలను మాత్రమే అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్, సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్, ఎలక్ట్రానిక్స్ అనుమతించరు.
- లేటెస్ట్ ఫొటోతో కూడిన ఫిల్ చేసిన ఆన్‌లైన్ దరఖాస్తుపై ఎడమ వేలిముద్ర ఉండాలి. ఇన్విజిలేటర్ సమక్షంలో దానిపై సంతకం చేయించుకుంటారు. ఆన్‌లైన్ అప్లికేషన్, రఫ్ నోట్స్‌ను పరీక్ష హాలులో పరీక్ష పూర్తయ్యాక అప్పగించాలి.
- విద్యార్థులు ఫోటో గుర్తింపు కార్డుగా కాలేజీ ఐడీ కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ.. ఇందులో ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి.
- ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటాయి. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు ఒకవేళ అవి అర్థం కాకపోతే ఇంగ్లిష్ భాషనే ప్రామాణికంగా తీసుకోవాలి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలు తలెత్తితే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి.
Published date : 06 May 2024 05:47PM