AP EAPCET 2024 New Schedule : బ్రేకింగ్ న్యూస్.. AP EAPCET 2024 పరీక్షల షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు ఇవే.. అలాగే ఈ పరీక్షలు కూడా..
సాధారణంగా షెడ్యూల్ ప్రకారం అయితే AP EAPCET 2024 మే 13వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏపీలో అదే రోజు పోలింగ్ ఉండడంతో షెడ్యూలు మార్చుతున్నట్లు విద్యాశాఖ అధికారలు తెలిపారు.
AP EAPCET 2024 కొత్త తేదీలు ఇవే..
AP EAPCET 2024 కొత్త షెడ్యూల్ ప్రకారం మే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 16, 17 వ తేదీలలో అగ్రికల్చరల్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మే 18వ తేదీ నుంచి 22 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
అలాగే ఈ పరీక్షను కూడా..
ఏపీ పీజీసెట్ 2024 పరీక్ష జూన్ 3వ తేదీ నుంచి 7 వరకు జరగాల్సి ఉంది. అయితే వాటిని జూన్ 10, 11, 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌కు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.
కోర్సులు ఇవే..
- ఈఏపీ సెట్‌లో స్కోర్ ద్వారా ఇంజనీరింగ్; అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో.. బీటెక్, బయో టెక్నాలజీ, బీటెక్(డైరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) కోర్సులు ఉన్నాయి.
- అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో.. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఫిషరీస్ సైన్సు, బీ ఫార్మసీ, ఫార్మాడీల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు.
- అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ(ఫారెస్ట్రీ) కోర్సుకు కూడా టీఎస్ ఈఏపీ సెట్ ర్యాంకునే పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హత :
- ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు.. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు కూడా అర్హులే.
- అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు ఇంటర్మీడియెట్ బైపీసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో అయిదు శాతం మినహాయింపు ఉంటుంది.
- ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష
- ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 80ప్రశ్నలు;ఫిజిక్స్ నుంచి 40; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్
అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో.. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. బయాలజీలో బోటనీ, జువాలజీ నుంచి 40 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
బెస్ట్ ర్యాంకు సాధించేలా..
మ్యాథమెటిక్స్ :
ఈఏపీసెట్‌లో 50 శాతం వెయిటేజీ ఉన్న సబ్జెక్ట్.. మ్యాథమెటిక్స్. కాబట్టి విద్యార్థులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంటర్మీడియెట్ మ్యాథమెటిక్స్ సిలబస్‌ను ఆల్‌జీబ్రా, కాల్కులస్, జామెట్రీ, వెక్టార్ ఆల్‌జీబ్రా,ట్రిగనోమెట్రీగా విభజించొచ్చు. లిమిట్స్ అండ్ కమ్యూనిటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డిఫైనెట్ ఇంటెగ్రల్, డిఫెరెన్షియెల్ ఈక్వేషన్స్‌పై దృష్టి పెట్టాలి. జామెట్రీకి వెయిటేజీ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో 2డీ, 3డీ జామెట్రీ, లోకస్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్రై ్టట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎల్లిప్స్, డైరక్షన్ కొసైన్స్, డైరక్షన్ రేషియోస్, ప్లేన్ తదితరాలు కీలక అంశాలుగా ఉంటాయి.
- అదే విధంగా ఆల్‌జీబ్రా విభాగంలో ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, డిమోయర్స్ థీరమ్, క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరమ్ తదితరాలపై పట్టు సాధించాలి. ట్రిగ్నోమెట్రీలో.. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్‌ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వెర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్‌బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్స్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. వెక్టర్ ఆల్‌జీబ్రా నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు వస్తున్నాయి. అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ అండ్ ప్రాబబిలిటీలో మెజర్స్ ఆఫ్ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌పై పట్టుసాధించాలి.
ఫిజిక్స్ :
హీట్ అండ్ థర్మోడైనమిక్స్‌కు వెయిటేజీ ఇవ్వాలి. ఈ చాప్టర్ నుంచి దాదాపు పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియెల్ అండ్ కెపాసిటెన్స్‌పై చాప్టర్ల నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున అడిగే అవకాశం ఉంది. వీటి తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్, రేఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వేవ్ ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఎ స్రై ్టట్ లైన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, డ్యూయల్ నేచుర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మేటర్, న్యూక్లిౖయె, సెమికండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టిపెట్టాలి. పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఉంటున్న మెకానిక్స్‌పై ప్రిపరేషన్ సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ, మోడ్రన్ ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
కెమిస్ట్రీ :
కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా విభజించుకొని చదవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇనార్గానిక్ తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలు నిలుస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ప్రధానంగా ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి.
బోటనీ :
డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్లాంట్స్(మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ (బ్యాక్టీరియా, వైరస్), జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయో టెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
జువాలజీ :
జువాలజీ నుంచి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రొటొజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, çహ్యూమన్ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లయిడ్ బయాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి.
ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం :
ఈఏపీసెట్‌కు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా అంశాల అభ్యసనంతోపాటు వాటిపై ఉన్న అవగాహన తెలుసుకునేందుకు సమాధానాలు, సమస్యల సాధాన చేయాలి. అదే విధంగా షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సూత్రం, సిద్ధాంతంపై అవగాహనతో అడుగులు వేయాలి. ఒక కాన్సెప్ట్‌కు చెందిన ప్రశ్నను భిన్న కోణాల్లో సమస్యను సాధించేందుకు కృషి చేయాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు సమయం వెచ్చించేలా సమయ పాలన పాటించాలి. విద్యార్థులు ప్రతి చాప్టర్‌లోని సినాప్సిస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
పునశ్చరణ :
అభ్యర్థులు పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు నుంచి పూర్తిగా పునశ్చరణకే ప్రాధాన్యం ఇచ్చేలా సమయాన్ని కేటాయించుకోవాలి. దీనికి అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకునే చేసుకునే విధంగా వ్యవహరించాలి. రివిజన్ సమయంలో తమకు ఎదురైన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. కొత్త అంశాలు, అకడమిక్స్‌లో విస్మరించిన అంశాలుంటే వాటిపై కొత్తగా దృష్టి పెట్టడం సరికాదని గుర్తించాలి.
Tags
- due to elections ap eamcet postponed 2024
- AP EAPSET 2024 Post Poned
- Engineering
- EAPCET Agriculture
- Pharmacy admissions
- ap eapcet 2024 new time table
- AP EAPCET 2024 New Schedule Details in Telugu
- AP EAPCET 2024 Postponed
- AP EAPCET 2024 Postponed News in Telugu
- ap eamcet 2024 cancelled
- AP EAMCET Exam Date 2024 Revised
- AP EAMCET Exam Date 2024 Revised News in Telugu
- AP EAMCET Important Dates 2024
- JNTUK has revised the AP EAMCET 2024 exam dates
- AP EAMCET 2024 exam dates rescheduled
- AP EAMCET 2024 exam dates rescheduled news telugu