Skip to main content

TG EAPCET 2025: మే తొలి వారంలో టీజీఈఏపీసెట్‌.. ప్రశ్నపత్రం ఇలా.. 120 మంది నిష్ణాతులతో రూపకల్పన..

రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్‌) నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి.
TG EAPCET 2025 Exam Details

వారం రోజుల్లో సెట్‌ తేదీలనూ వెల్లడించే వీలుందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. మే మొదటి వారంలో ఈఏపీసెట్‌ నిర్వహిస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఈ సెట్‌ తేదీలను ఖరారు చేయడం ఆనవాయితీ.

ఈ బాధ్యతను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌కు అప్పగించారు. టీసీఎస్‌తో రెండుసార్లు సమావేశమైన ఉన్నతాధికారులు పరీక్ష తేదీలపై స్పష్టతకు వచ్చారు.  

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్‌ పేపర్స్ | గెస్ట్ కాలమ్

ప్రశ్నపత్రం ఇలా.. 

సెట్‌ నిర్వహణ బాధ్యతను ఈసారి కూడా జేఎన్‌టీయూహెచ్‌కే అప్పగించారు. వర్సిటీ ప్రొఫెసర్‌ దీన్‌కుమార్‌ను కన్వీనర్‌గా ఎంపిక చేశారు. ఇదే వర్సిటీకి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ఇన్‌చార్జి వీసీగా ఉన్నారు. వీరి నేతృత్వంలో ప్రశ్నపత్రం రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఈఏపీసెట్‌ 160 మార్కులకు ఉంటుంది.

మ్యాథ్స్‌ 80 మార్కులు, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు ఉంటుంది. సైన్స్‌ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ .. ప్రతి సబ్జెక్టుకు 40 మార్కుల చొప్పున పేపర్‌ రూపొందించాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణుల నుంచి ముందుగా కొన్ని వేల ప్రశ్నలను క్రోడీకరించాల్సి ఉంటుంది. ఇందులోంచి దశలవారీగా ప్రశ్నలను తీసుకుని ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సెషన్‌లో వచ్చిన ప్రశ్న మరే ఇతర సెషన్‌లో రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. 

>> College Predictor - 2024 AP EAPCET TS EAMCET

120 మంది నిష్ణాతులతో.. 

ప్రశ్నపత్రం రూపకల్పనలో అత్యంత గోప్యత పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న 120 మంది నిష్ణాతులను ఎంపిక చేశారు. వారి వ్యక్తిగత వివరాలు, ట్రాక్‌ రికార్డును సేకరించారు. ఏ కోచింగ్‌ కేంద్రంలోనూ పనిచేయడం లేదని, ప్రైవేటు కాలేజీలతో సంబంధం లేదనే డిక్లరేషన్‌ వీరినుంచి తీసుకున్నారు. సంబంధిత నిర్దిష్ట సబ్జెక్టును కనీసం పదేళ్ళుగా బోధిస్తూ ఉండాలి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

వీరి పిల్లలు కానీ, బంధువులు కానీ సెట్‌ రాయకూడదు. కాగా క్వశ్చన్‌ బ్యాంకు రూపొందించే పనిలో కొంతమంది ఉంటారు. ఆ తర్వాత వాటిల్లోంచి కొన్నింటిని గుర్తించే పనిలో మరికొంతమంది ఉంటారు. తర్వాత దశలో వడపోత (వెట్టింగ్‌) విధానంలో పనిచేయడానికి మరికొంతమంది ఉంటారు. ఎవరికైనా కేవలం ఒకే దశలో పనిచేసే అవకాశం ఉంటుంది. యావత్‌ ప్రక్రియపై పటిష్టమైన నిఘా కొనసాగుతుంది. ఎంపిక చేసిన ప్రశ్నలను అంతిమంగా కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. తేలికపాటి ప్రశ్నలు, కాస్త కఠినమైనవి, కఠిన ప్రశ్నల నిష్పత్తిని కంప్యూటర్‌ విభజిస్తుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. 

Published date : 27 Dec 2024 03:57PM

Photo Stories