TS EAPCET 2024 Exam Exam Schedule Change: టీఎస్‌ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు!
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 9 నుంచి 12 వరకు టీఎస్‌ఈఏపీసెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తొలుత ప్రకటించింది.
అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీఎస్‌ఈఏపీసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని భావిస్తున్నది. మే 8 నుంచి 11వ తేదీ వరకు టీఎస్‌ఈఏపీసెట్ రాతపరీక్షలను నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.
>> College Predictor - 2023 - AP EAPCET | TS EAMCET
సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశమున్నది. మే 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ రాతపరీక్షలు.. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు షెడ్యూల్ ని రూపొందించినట్టు సమాచారం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.
>> Top 20 Engineering Colleges 2023 - Andhra Pradesh | Telangana
టీఎస్‌ఈఏపీసెట్‌కు 1.68 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఈఏపీసెట్ (ఎంసెట్)కు 1,68,798 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు టీఎస్‌ఈఏపీసెట్ కన్వీనర్ బి డీన్ కుమార్, కోకన్వీనర్ కె విజయకుమార్ రెడ్డి మార్చి 19న ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంజినీరింగ్ విభాగానికి 1,18,387 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 50,265 మంది, ఆ రెండు విభాగాలకూ 146 మంది కలిపి మొత్తం 1,68,798 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే. ఇతర వివరాల కోసం https://eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.