Success Story: 36 లక్షల వేతనాన్ని వదిలేసి సివిల్స్ వైపు అడుగులు... వరుసగా మూడు ప్రయత్నాల్లో ఫెయిల్... చివరికి సక్సెస్ సాధించానిలా
తన లక్ష్యమైన ఐఏఎస్ కోసం అన్నింటిని వదిలేసుకుని పట్టుదలతో చదివి చివిరికి సాధించాడు. అతని సక్సెస్ జర్నీ సాగిందిలా...
రాబిన్ బన్సాల్‌ది రాజస్థాన్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లాలోని లెహ్రా అనే చిన్న పట్టణం. రాబిన్ తండ్రి ఎకనామిక్స్ లెక్చరర్, తల్లి గృహిణి. పాఠశాల విద్య అంతా స్థానికంగానే పూర్తి చేశాడు రాబిన్. ఇంటర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తన లక్ష్యం ఐఐటీపై పడింది. దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో సీటు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివాడు. జేఈఈలో మంచి ర్యాంకు రావడంతో ఐఐటీ ఢిల్లీలో సీటు వచ్చింది.
Telugu Topper IFS Success Story: కరెంట్ అఫైర్స్ కోసం వీటినే ఫాలో అయ్యా... యూట్యాబ్ సాయంతో కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంకు సాధించానిలా...
ఢిల్లీకి చేరుకోగానే బన్సాల్ లక్ష్యం మారిపోయింది. తన కలలు సివిల్స్ వైపు మళ్లాయి. ఐఐటీలో చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్ సాధించడంపై ద`ష్టి పెట్టాడు. నాలుగేళ్లలో ఆడుతుపాడుతూ బీటెక్ కంప్లీట్ చేశారు. కాలేజీ ప్లేస్‌మెంట్స్‌లో అదిరిపోయే ప్యాకేజీ దక్కింది. ఏడాదికి రూ.36 లక్షల వేతనంలో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కానీ, తన లక్ష్యం మాత్రం సివిల్స్ పైనే ఉంది.
ఉద్యోగమా, సివిల్సా అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి సివిల్స్ తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఏడాదిపాటు ఉద్యోగం చేసి, ఆ కార్పొరేట్ కొలువుకు రాజీనామా చేసేశాడు. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. అలా 2019 నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టారు.
IAS Varun Baranwal Success Story: 15 ఏళ్లకే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీ
సివిల్స్‌కు సన్నద్ధమయ్యే సమయంలో బన్సాల్‌కు తెలిసింది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో. తన సాధనంతా సివిల్స్‌ని క్రాక్ చేసే దానిపైనే పెట్టి 2019లో మొదటిసారి పరీక్ష రాశారు. కానీ, ఫలితం ఫెయిల్. ఎంతో కష్టపడి చదివినా ఫలితం నిరాశకు గురిచేసింది. రెండో ప్రయత్నం మరింత పట్టుదలతో మొదలుపెట్టారు. కానీ, ఫలితం మాత్రం సేమ్.
తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమవడంతో ఒకింత నిరాశకు లోనయ్యాడు బన్సల్. రెండు ప్రయత్నాల్లో చేసిన తప్పులు, తనకు వచ్చిన మార్కులను బేరీజు వేసుకున్నాడు. చేసిన తప్పులు చేయకుండా ఈసారి మూడో ప్రయత్నానికి సిద్ధమయ్యాడు. కానీ, నిరాశే ఎదురైంది. వరుసగా మూడు ప్రయత్నాలు విఫలమవడంతో బన్సాల్‌లో పట్టుదల మరింత పెరిగింది. ఎలా అయినా సరే సాధించాలి అన్న సంకల్పం బలంగా నాటుకుపోయింది.
Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ పని చేశా.. చివరికి ఇలా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానిలా.. కానీ..
నాలుగో ప్రయత్నానికి తీవ్రంగా కష్టపడ్డాడు బన్సల్. ప్రతీ రోజు 10 గంటల పాటు చదివేవాడు. తన నోట్స్ తనే ప్రిపేర్ చేసుకునేవాడు. కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్‌ను జల్లెడ పట్టేవాడు. ఏ ఒక్క మార్కు మిస్ చేయకూడదనే పట్టుదల బన్సాల్‌లో పెరిగింది. సర్వ శక్తులతో నాలుగో ప్రయత్నానికి సిద్ధమయ్యాడు. అలా 2022లో నిర్వహించిన సీఎస్ఈ పరీక్షకు హాజరయ్యారు.
ప్రిలిమ్స్‌లో ఈజీగా ఉత్తీర్ణత సాధించాడు బన్సాల్. మెయిన్స్‌పై ప్రత్యేక గురి పెట్టి చదివాడు. అది కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. చివరగా నిర్వహించే పర్సనల్ టెస్ట్ ఒక్కటే తన ముందు ఉంది. అదొక్క అడుగు విజయవంతంగా వేస్తే తన లక్ష్యం నెరవేరుతుంది. కానీ, భయం మాత్రం అలానే ఉంది. కానీ, తన సంకల్పం ముందు భయం అనేది విసుమెత్తు ప్రభావం చూపలేకపోయింది. సీనియర్స్ గైడెన్స్‌తో, మాక్ ఇంటర్వ్యూలతో తన లోని భయాన్ని పోగట్టుకున్నాడు.
NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్లకే పెళ్లి... 20 ఏళ్లకు పాప... ఐదో ప్రయత్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
పర్సనల్ టెస్ట్ ముగిసింది. ఇక తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. బన్సాల్‌లో ఒకటే టెన్షన్. ఈ సారైనా తన లక్ష్యాన్ని చేరుకుంటానా అన్న భయం అలానే ఉంది. ఆశగా అంతే భయంగా ఎదురుచూసిన ఫలితాలు రానే వచ్చాయి. తుది ఫలితాల్లో ఆల్ ఇండియా 135వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
IPS Success Story: ఇంజినీరింగ్ నుంచి ఐపీఎస్ అధికారిగా.. రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ ఎలా సాధించిందంటే...
ర్యాంకు వచ్చిన సందర్భంగా బన్సల్ మాట్లాడుతూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి కానీ, నిరాశకు గురికావొద్దని చెప్తాడు. సివిల్స్ వైపు అడుగులు వేసే ముందే అన్ని విధాలుగా ఆలోచించుకోవాలని, కొన్ని సందర్భాల్లో విజయం సాధించకుండానే మన ప్రయాణం ముగిసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సెల్ఫ్ మోటివేషన్ అవసరం. అన్ని అపజయాలను ఎదుర్కొని నిల్చున్నపుడే విజయం సాకారమవుతుంది. మన బలం, బలహీనతల గురించి తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని రూపొందించుకుని దాన్ని అనుసరించాలి అని చెప్తున్నాడు బన్సాల్.