IAS Success Story: ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు... 22 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన అంకుర్ గార్గ్
దేశంలోనే అత్యున్నత ఉద్యోగమైన సివిల్ సర్వెంట్ జాబ్‌లకు పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికి విదితమే. ఇక్కడ సత్తాచాటేందుకు ఒక్కో అభ్యర్థి అలుపెరగకుండా దండయాత్ర చేస్తుంటారు. కొంతమంది మూడు, నాలుగు ప్రయత్నాల్లో విజయం సాధిస్తూ ఉంటారు. కానీ, పదుల సంఖ్యలో అభ్యర్థులు మాత్రం మొదటి ప్రయత్నంలోనే అడ్డంకులన్నీ దాటుకుని ఉత్తీర్ణత సాధింస్తుంటారు.
ఇవీ చదవండి: జస్ట్ పాస్ మార్కులతో పది పాసయ్యా... కట్ చేస్తే ఇప్పుడు కలెక్టర్‌గా సేవలందిస్తున్నా..
అయితే ఓ అభ్యర్థి 22 వయసులోనే తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అతనే అంకుర్ గార్గ్. ఇతను ఏజీఎంయూటీ కేడర్ కు చెందిన 2003 బ్యాచ్ అధికారి. 2002లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 22 ఏళ్ల వయసులోనే టాపర్‌గా నిలిచాడు. అప్పట్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సీఎస్ఈలో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరారు.
ఇవీ చదవండి: ప్రభుత్వ బడుల్లో చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా...
పంజాబ్ లోని పాటియాలాకు చెందిన అంకుర్.. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (1998-2002)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తయిన వెంటనే యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష రాశాడు. ఐఏఎస్‌గా ఎంపికైన తర్వాత కూడా తన చదువును ఆపలేదు. ప్రజలకు సేవలందిస్తూనే ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్ (2018-2020) పూర్తి చేశారు.
ఇవీ చదవండి: నాలుగో ప్రయత్నంలోనే ఐపీఎస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్... నా సక్సెస్ జర్నీ ఇదే
అంకుర్ గార్గ్ గురించి మరిన్ని విషయాలు..
అంకుర్ గార్గ్ పంజాబ్‌లోని పాటియాలాలో 14/06/1980న జన్మించారు. అంకుర్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన సోదరి కూడా వైద్యురాలే. ఆయన హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, పంజాబీ భాషలతో పాటు ఫ్రెంచ్‌లోనూ అనర్గళంగా మాట్లాడగలరు. భార్య స్వాతి శర్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.