Medical College: త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం..
మదనపల్లె: రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న మదనపల్లె మెడికల్ కాలేజీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయని విజయవాడకు చెందిన ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకడమిక్) రఘునందన్ తెలిపారు. శనివారం మదనపల్లెకు వచ్చిన ఆయన, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ కళాశాలకు సంబంధించి నిర్మాణంలోని భవనాలను పరిశీలించారు.
Star Streams: పురాతన నక్షత్రాల ప్రవాహాలను గుర్తించిన గియా టెలిస్కోప్!!
అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంఈ రఘునందన్ మాట్లాడుతూ.. మదనపల్లె మెడికల్ కాలేజీ అడ్మిషన్లకు సంబంధించి 150 మంది యూజీ విద్యార్థులు జూలై చివరి లేదా ఆగస్టు మొదటివారంలో రానున్న సందర్భంగా జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాల వద్ద ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చామన్నారు. 420 బెడ్స్ జిల్లా ఆస్పత్రిలో సిద్ధంగా ఉన్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో చూపామన్నారు.
Free Training: ఈ రంగాల్లో పురుషులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు వివరాలు..!
మిగిలిన వైద్యపరికరాలు, సామగ్రిని విడతల వారీగా కల్పిస్తామని చెప్పామన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి సమయానుసారంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు వచ్చేలోపు వారికి కావాల్సిన వసతులను విడతల వారీగా జూలై చివరికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కళాశాల భవన నిర్మాణ పనుల ప్రగతిపై సంతృప్తిగా ఉన్నామని, ఏపీఎండీసీ అధికారులు త్వరగా పూర్తిచేయడంపై హర్షం వ్యక్తం చేశారు.