Skip to main content

Students Fees : విద్యార్థులను ఫీజు విష‌యంలో ఒత్తిడి చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు!

No pressurizing on students for fees payment

నంద్యాల: జిల్లాలోని అన్ని జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ, పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో చదివే విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Students Protest : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల నిరసన

విద్యార్థులు ఫీజు చెల్లించలేదనే కారణంతో హాల్‌ టికెట్లు జారీ చేయకపోయినా, ఒరిజినల్‌ ధ్రువపత్రాలు ఇవ్వకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. జ్ఞానభూమి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మెస్‌ చార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. హాల్‌ టికెట్టు ఇవ్వకపోయినా, ధ్రువపత్రాలు జారీ చేయకపోయినా కలెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ ఫోన్‌ 08514–293903, 08514–293908 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Nov 2024 05:44PM

Photo Stories