Job Mela: ఉద్యోగాలతో గిరిజన యువతకు స్థిర జీవనం

భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి జీవితం సుస్థిరమవుతుందని ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు.
ఉద్యోగాలతో గిరిజన యువతకు స్థిర జీవనం

 భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో సెప్టెంబ‌ర్ 6న‌ నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడి వారి అర్హతలు, అనుభవం తెలుసుకుని ఉద్యోగాల ఎంపికకు సూచనలు చేశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. చదువుకున్న గిరిజన యువతకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి జాబ్‌మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉద్యోగంలో చేరితే అనుభవం వస్తుందని.. ఆ తర్వాత అర్హతల ఆధారంగా మెరుగైన స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.

చదవండి: Govt Jobs 2023: 103 మందికి కారుణ్య నియామకాలు

కాగా, వైటీసీ ఆధ్వర్యాన గిరిజన యువతకు వివిధ ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వడమే కాక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొందరు యువతీ, యువకులు టెట్‌, డీఎస్సీ కోచింగ్‌ శిక్షణ ఇప్పించాలని కోరగా పరిశీలిస్తామని పీఓ బదులిచ్చారు. అనంతరం వివిధ ప్రైవేట్‌ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 303 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌, ఐటీడీఏ అధికారులు, వివిధ ప్రైవేట్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
చదవండి: SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

#Tags