Skip to main content

Govt Jobs 2023: 103 మందికి కారుణ్య నియామకాలు

మహారాణిపేట: ప్రభుత్వ ఉద్యోగులు నిజాయతీ, నిస్వార్థంగా సేవలందించాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు. పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామక పత్రాలు అందించారు.
నియామక పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌
నియామక పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌

ఉమ్మడి విశాఖ జిల్లాలో సాధారణ కారుణ్య నియామకాల కింద 70 మందికి, రెవెన్యూ శాఖలో 9 మందికి, గ్రామ సచివాలయాల్లో ముగ్గురికి, ఆర్టీసీలో 21 మందికి, రెవెన్యూ శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌(గ్రూప్‌–4) ద్వారా ఎంపికై న 43 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీరందరికీ కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపి.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

APPSC Group-1 స్టేట్ 1st ర్యాంక‌ర్ Bhanusri Interview| నేను చదివిన పుస్తకాలు ఇవే..|#sakshieducation

2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 436 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు ప్రజలకు సేవ చేయాలని.. సమయపాలన పాటించాలన్నారు. డీఆర్వో ఎస్‌.శ్రీనివాసమూర్తి, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, కలెక్టరేట్‌ కార్యాలయ పరిపాలన అధికారి కె.ఈశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

APPSC Group-1.. తొలి ప్రయత్నంలోనే కొట్టానిలా..| APPSC Group 1 Ranker Pavani Success Story | DSP Job

Published date : 06 Sep 2023 04:04PM

Photo Stories