Medical Colleges: ఏపీ మెర్క్‌ పరిధిలోకి నూతన వైద్య కళాశాలలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎంఈ పరిధిలో ఉన్న 8 ఆస్పత్రులు, కొత్తగా నిర్మిస్తోన్న 16 వైద్య కళాశాలలను ఏపీ వైద్య విద్య, పరిశోధన కార్పొరేషన్‌ (ఏపీమెర్క్‌) పరిధిలోకి ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఏపీ మెర్క్‌ పరిధిలోకి నూతన వైద్య కళాశాలలు

అదే విధంగా తిరుపతి రుయా, శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలను కార్పొరేషన్‌ నుంచి తొలగించింది. ఈ కార్పొరేషన్‌ ను ఏపీమెర్క్‌ చట్టం 2021 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్య కళాశాలలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, నూతన వైద్య కళాశాలల నిర్మాణం తదితర అంశాలు కార్పొరేషన్‌ పరిధిలోనే జరుగుతాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మే 26న‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి: 

 

 

 

వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై కేంద్రం వివక్ష!​​​​​​​

దేశవ్యాప్తంగా 75 కొత్త వైద్య కళాశాలలు​​​​​​

#Tags