‘ఎంపీహెచ్‌డబ్ల్యూ’కు దరఖాస్తుల ఆహ్వానం
Multipurpose Health Workers(MPHW) కోర్సులో మహిళలకు ప్రవేశాల కోసం వైద్య శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 31 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. https://cfw.ap.nic.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని.. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, స్టడీ సర్టిఫికెట్‌లతో పాటు కుల, నివాస ధ్రువపత్రాలు జత చేసి రిజిస్ట్రేషన్ ఫీజు(రూ.50 డీడీ)తో కలిపి డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో అందజేయాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇంటర్ విద్యాభ్యాసంతో.. డిసెంబర్ నెలాఖరుకు 17 ఏళ్లు నిండిన వారు, 30 ఏళ్లలోపువారు దరఖాస్తులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 61 శిక్షణ కేంద్రాల్లో రెండేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కేంద్రాల్లో ఉచితంగా, ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో 60 శాతం సీట్లలో ఉచిత ప్రవేశాలుంటాయి. మిగిలిన 40 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. జేసీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఉచిత సీట్ల భర్తీ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. అర్హుల జాబితాను నవంబర్ 14న డీఎంహెచ్‌వోలు ప్రకటిస్తారు. నవంబర్ 21 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
చదవండి:
Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం