ISB: ఐఎస్‌బీలో టింకర్‌ప్రెన్యూర్స్‌ బూట్‌ క్యాంప్‌..

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఎస్‌బీలోని ఐ–వెంచర్, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్, నీతిఆయోగ్‌ భాగస్వామ్యంతో ‘అటల్‌ క్యాటలిస్ట్‌ ఎట్‌ ఐఎస్‌బీ’పేరుతో ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌’కార్యక్రమాన్ని మే 31న నిర్వహించింది.
ఐఎస్‌బీలో టింకర్‌ప్రెన్యూర్స్‌ బూట్‌ క్యాంప్‌..

ఫ్యాకల్టీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భగవాన్‌ చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలను అభివృద్ధి చేయడానికి ఐఎస్‌బీ కట్టుబడి ఉందన్నారు. యువ పారిశ్రామిక వేత్తలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌’ఓ ముందడుగని తెలిపారు. 9వేలమంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉత్తమ వంద విద్యార్థులు/విద్యార్థి బృందాలు తమ ఆలోచనలను పంచుకున్నారు. అందులో ఎంపికైన బృందాల ఆలోచనలను అభివృద్ధి చేసి, కార్యరూపం దాల్చేందుకు విద్యార్థులకు ‘ఐ–వెంచర్‌’తోడ్పాటునందించనుంది. ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులైన 65 మంది మెంటర్స్‌ అందుబాటులో ఉండి విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేస్తారు. అనంతరం అందులోంచి పది ఉత్తమ వెబ్‌సైట్లు లేదా యాప్‌లను ఎంపిక చేసి వారికి అనుకూలమైన స్పాన్సర్స్‌ను కూడా కేటాయిస్తారు. మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌చింతన్‌ వైష్ణవ్‌ మాట్లాడుతూ... రెండునెలలపాటు ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌’లో జరిగే ఈ టింకర్‌ప్రెన్యూర్‌ బూట్‌క్యాంప్‌ ఎంతో ప్రత్యేకమైనదని, విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: 

ATL 2021: స్పేస్ చాలెంజ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. విజేతల వివరాలు..

#Tags