ATL 2021: స్పేస్ చాలెంజ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. విజేతల వివరాలు..
ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గురుకులాల కార్యదర్శి కె.హర్షవర్థన్ జనవరి 13న మీడియాకు వెల్లడించారు. 2021 అక్టోబర్‌లో జరిగిన ఏటీఎల్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు 2,500 ఆవిష్కరణలను ప్రదర్శించారని చెప్పారు. వాటిలో 75 ఉత్తమ ఆవిష్కరణలను జనవరి 12న ప్రకటించారని వెల్లడించారు. ఇందులో ఏపీకి సంబంధించి మూడు ఆవిష్కరణలకు మంచి పేరొచి్చందని తెలిపారు. ఆ మూడు ఆవిష్కరణలు కూడా ఎస్సీ గురుకులాల విద్యార్థులవే కావడం గమనార్హమన్నారు. వీరికి త్వరలోనే ఇస్రో, నీతి ఆయోగ్ నుంచి బహుమతులు వస్తాయని తెలిపారు.
మూడు ఆవిష్కరణలు, విజేతల వివరాలు..
ఆవిష్కరణ అంశం |
విద్యా సంస్థ |
విజేతలు |
ఇన్ హెబిట్ స్పేస్ |
ఎస్సీ గురుకుల విద్యాలయం, మధురవాడ, విశాఖ |
వై.జెస్సిక, ఇ.అరుంధతి, ఊరి్మళ |
రీచ్ స్పేస్ |
ఎస్సీ గురుకుల విద్యాలయం మార్కాపురం, ప్రకాశం |
కె.చిన్నా థెరిసా, వై.రోజ్‌మేరి, పి.మధులిక |
ఎక్స్‌ప్లోర్ స్పేస్ |
ఎస్సీ గురుకుల విద్యాలయం నెల్లిమర్ల, విజయనగరం |
జి.లావణ్య, ఆర్.పూజిత, కె.చిన్నమ్మి |
చదవండి:
Wipro: పోటీల్లో మన విద్యార్థుల సత్తా