Skip to main content

ISRO jobs news: ISROలో ఉద్యోగాలు ఈ అర్హతతో ఉంటే చాలు..

ISRO jobs news  ISRO Human Space Flight Center job notification  HSFC recruitment notification for permanent posts HSFC recruitment notification 2024 by ISRO  ISRO job openings at Human Space Flight Center
ISRO jobs news

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) లో వివిధ రకాల ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత గల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

గుడ్‌న్యూస్‌ భారీగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలు: Click Here

ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ – SD (ఏవియేషన్ లేదా స్పోర్ట్స్), మెడికల్ ఆఫీసర్ – SC, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ – SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, డ్రాట్స్ మెన్ – B , అసిస్టెంట్ (రాజ్ భాష) అని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 9
 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ISRO – HSFC నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ – SD (ఏవియేషన్ లేదా స్పోర్ట్స్), మెడికల్ ఆఫీసర్ – SC, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ – SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, డ్రాట్స్ మెన్ – B , అసిస్టెంట్ (రాజ్ భాష)

మొత్తం ఖాళీల సంఖ్య : 103

పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉంది

మెడికల్ ఆఫీసర్ SD (ఏవియేషన్ లేదా స్పోర్ట్స్) – 02
మెడికల్ ఆఫీసర్ SC – 01
సైంటిస్ట్ లేదా ఇంజనీర్ SC – 10
టెక్నికల్ అసిస్టెంట్ – 28
సైంటిఫిక్ అసిస్టెంట్ – 01
టెక్నీషియన్ B – 43
డ్రాట్స్ మెన్ B – 13
అసిస్టెంట్ (రాజ్ భాష) – 05

విద్యార్హత : పోస్టులను అనుసరించి 10th+ITI, Diploma, BE / B.tech, ME / M.tech వంటి వివిధ రకాల అర్హతలు ఉండాలి.

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు 

గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్టంగా 35 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే రకంగా ఉద్యోగాలు ఉన్నాయి.

వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు వయసులో పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-09-2024

అప్లికేషన్ చివరి తేదీ : 09-10-2024

అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయవచ్చు. 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
 

Published date : 24 Sep 2024 03:10PM

Photo Stories