Skip to main content

Constable jobs Latest News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ భారీగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

Constable jobs news  CISF Recruitment Notification for 1130 Fire Constable Posts  Eligible Candidates Can Apply Online for CISF Fire Constable Jobs  CISF Fire Constable Recruitment Allotted Posts for Telugu States Apply for CISF Fire Constable Jobs   CISF 1130 Fire Constable Vacancies 2024
Constable jobs news

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) నుండి 1130 ఫైర్ కానిస్టేబుల్  ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. మన తెలుగు రాష్ట్రానికి కూడా కొన్ని పోస్టులు కేటాయించారు.

ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు: Click Here

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు...

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

భర్తీ చేస్తున్న పోస్టులు:

CISF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1130 కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య:
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య – 1130. ఇందులో రిజర్వేషన్ కేటగిరీలు వారీగా ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉంది. 

UR – 466
EWS – 114
SC – 153
ST – 161
OBC- 236

అర్హత:  
అభ్యర్థులు సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. 

జీతం:
Level-3 పే స్కేల్ ప్రకారం 21,700/- నుండి 69,100/- వరకు ఉంటుంది.

వయస్సు: 
కనీసం 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సులో సడలింపు:
క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-08-2024

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 31-08-2024

అప్లికేషన్ చివరి తేదీ: 30-09-2024

ఫీజు చెల్లించుటకు చివరి తేదీ: 30-09-2024

అప్లికేషన్ విధానం
అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు
GEN / OBC / EWS అభ్యర్థులకు 100/-
SC , ST, Ex-సర్వీస్ మెన్ ఫీజు లేదు. 

ఎంపిక విధానం
ఈ ఉద్యోగాల ఎంపికలో క్రింది పరీక్షలు ఉంటాయి. 

శారీరిక సామర్థ్య పరీక్షలు 
శారీరక కొలతల పరీక్షలు 
రాత పరీక్ష 
డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
వైద్య పరీక్షలు


Download Full Notification: Click Here

Apply Online: Click Here
 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

 

Published date : 24 Sep 2024 09:36AM

Photo Stories