Research Data of Chandrayaan 3 : ఇస్రో అందుబాటులోకి చంద్రయాన్–3 పరిశోధన డేటా
చంద్రయాన్–3 మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ శాస్త్రవేత్తలకూ అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమనౌక కాలుమోపి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ చర్యను చేపట్టింది. మొత్తం 55 గిగాబైట్ల డేటాను అందిస్తోంది. చంద్రయాన్–3లో భాగంగా ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లోని ఐదు సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి.
Gaganyaan Mission : అంతరిక్షంలోకి 4 వ్యోమగాములు.. 20 ఈగలు..
‘ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడంలేదు. దేశ, విదేశాల్లోని పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం. దీనివల్ల ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది‘ అని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ (ఐఎస్‌ఎస్ డీసీ) కి సంబంధించిన వెబ్ సైట్ నుంచి ఈ డేటాను పొందవచ్చు.
Vigyan Dhara Scheme : విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం..