Vigyan Dhara Scheme : విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
Sakshi Education
ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ’విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది.
విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ’విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021–22 నుంచి 2025–26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Aparajita Bill: అత్యాచార దోషులకు మరణ శిక్ష.. ‘అపరాజిత’ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టొరల్ రిసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించనుంది. అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్‌లు వంటివి ఈ పథకంలో ఉంటాయి.
Published date : 04 Sep 2024 03:43PM