Skip to main content

School Girls Free Training at ISRO: స్కూల్ అమ్మాయిలకు గోల్డెన్‌ ఛాన్స్‌ ISRO లో ఉపగ్రహం తయారీకి ఉచిత శిక్షణ

Shaktisat mission training students in aerospace and payload development  School Girls Free Training  Shaktisat mission training 12,000 girls in space technology  High school girls learning space technology under Shaktisat mission
School Girls Free Training

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడుగు పడింది. చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

స్పేస్ కిడ్జ్ ఇండియా భాగస్వామ్యం: ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది.

శక్తిశాట్ మిషన్ ప్రారంభం: అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు శక్తిశాట్ అనే మిషన్ను ప్రారంభించింది. 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

10వ తరగతి అర్హతతో Income Tax Department లో అటెండర్‌, క్లర్క్‌ ఉద్యోగాలు నెలకు జీతం 40వేలు: Click Here

అంతర్జాతీయ సహకారం: ఈ శక్తిశాట్ మిషన్‌లో బ్రిటన్, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు భాగస్వామ్యం కానున్నాయి.

విద్యార్థుల ఎంపిక మరియు శిక్షణ: శిక్షణ అనంతరం, ప్రతి దేశం నుండి ఒక విద్యార్థిని ఎంపిక చేసి, వీరికి పేలోడ్లు, స్పేస్‌క్రాఫ్ట్ ప్రోటోటైప్లను రూపొందించడంలో శిక్షణ ఇస్తారు.

ప్రధానమంత్రి ముందు ప్రజెంటేషన్: ఇస్రో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించిన మోడల్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.

సమర్థత మరియు ప్రయోజనం: ఈ శక్తిశాట్ మిషన్ కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం కలిగి ఉందని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ తెలిపింది.

స్పేస్ కిడ్జ్ ఇండియా విజయాలు: ఇప్పటి వరకు 18కి పైగా బెలూన్ శాటిలైట్లు, 3 సబ్ ఆర్బిటల్ పేలోడ్లు, 4 ఆర్బిటల్ ఉపగ్రహాలను ప్రయోగించిన మొదటి సంస్థగా గుర్తింపు పొందింది.

Published date : 16 Oct 2024 08:07AM

Photo Stories