JEE Mains 2024 Exam: ఈనెల 26 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. రివిజన్‌కు, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం.. విధానం ఇలా!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్స్ మార్కులు, పర్సంటైల్ ఆధారంగా 2.5 లక్షల మందికి జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఈనెల 26న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపేందుకు నిపుణుల ఎగ్జామ్ టిప్స్..
Rita Sherpa: 29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?
26న అడ్వాన్స్‌డ్ పరీక్ష
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈ నెల 26న నిర్వహించనున్నారు. మొత్తం రెండు పేపర్లుగా మూడు సబ్జెక్ట్‌లలో పరీక్ష జరుగుతుంది. ఈసారి కూడా పరీక్ష గత ఏడాది మాదిరిగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 17 ప్రశ్నలు చొప్పున అడిగే అవకాశం ఉంది. అంటే.. ఒక్కో పేపర్‌లో 51 ప్రశ్నలు ఉండొచ్చు. అదే విధంగా..ఒక్కో పేపర్‌కు 180 మార్కులు చొప్పున రెండు పేపర్లను కలిపి 360 మార్కులకు పరీక్ష జరిగే అవకాశముంది.
రివిజన్‌కు ప్రాధాన్యం
ప్రస్తుతం సమయంలో విద్యార్థులు పూర్తిగా రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే తాము రాసుకున్న నోట్స్ లేదా రెడీ రెకనర్స్ ఆధారంగా పునశ్చరణ చేసుకోవాలి. అలా పునశ్చరణ చేసుకుంటున్నప్పుడే.. సంబంధిత టాపిక్స్ ప్రాథమిక భావనలు, సూత్రాలు, అన్వయం వంటి వాటిని అవలోకనం చేసుకోవాలి. రివిజన్ సమయంలోనూ వెయిటేజీ ఆధారంగా వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేస్తుంది. ఇందుకోసం గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి.
Senior Medical Officer Posts: 'హాల్'లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు..
వెయిటేజీకి అనుగుణంగా
రివిజన్ సమయంలో అభ్యర్థులు సబ్జెక్ట్‌ల వారీగా అత్యంత ముఖ్యమైన అంశాలపై ఫోకస్ చేయాలి. మ్యాథమెటిక్స్‌లో.. కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌పై దృష్టి పెట్టాలి.
కెమిస్ట్రీలో.. కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహారల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీలను చదవాలి. ఫిజిక్స్‌లో.. ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్‌పై పట్టు సాధించాలి.
మోడల్ టెస్ట్‌లు
ప్రస్తుతం సమయంలో రెండు లేదా మూడు మోడల్ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. పరీక్ష ఫలితం విశ్లేషించుకుని.. తాము చేస్తున్న పొరపాట్లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ పొరపాట్లు పరీక్ష హాల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను సాధన చే యాలి. పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి.
Quiz of The Day (May 13, 2024): ఏ కారణంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు?
ప్రాక్టీస్ టెస్ట్ సదుపాయం
అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్న విద్యార్థులు.. అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రాక్టీస్ టెస్ట్‌ల సదుపాయాన్ని వినియోగించుకోవాలి. నిర్వాహక ఇన్‌స్టిట్యూట్ ఐఐటీ–చెన్నై అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో రెండు టెస్ట్‌లను అందుబాటులో ఉంచింది. వీటిని సాధన చేయడం ద్వారా ప్రశ్నల శైలిపై అవగాహన పెరుగుతుంది.
కొత్త అంశాలు
జేఈఈ–మెయిన్‌లో ఈ ఏడాది పలు టాపిక్స్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో.. మెయిన్ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు విద్యార్థులు ఆ సిలబస్‌కు అనుగుణంగానే ప్రిపరేషన్ సాగించి ఉంటారు. కాని అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టమైంది. దీంతో మెయిన్ ప్రిపరేషన్ సమయంలో విస్మరించిన టాపిక్స్‌పై విద్యార్థులు ఇప్పుడు దృష్టిపెట్టాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అడ్వాన్స్‌డ్ పరీక్షలో లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా ప్రాధాన్యం క్రమంలో సన్నద్ధమవ్వాలి.
Student Visa Rules: ఇక్కడ చదువుకోవాలనుకునే విద్యార్థుల వీసాకు కొత్త రూల్ ఇదే..
ఒత్తిడికి దూరంగా
చివరి సమయంలో అభ్యర్థులు చేసే పొరపాటు.. రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టడం. పరీక్ష సమీపిస్తున్న తరుణంలో అతిగా చదవడం వల్ల అనవసరమైన ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. కాబట్టి బ్యాలెన్స్‌డ్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలమనే ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్, మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్, పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
Executive Posts: న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు..
పరీక్ష రోజు ఇలా
- ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభే అత్యంత నిర్ణయాత్మకంగా నిలుస్తుంది.
- పరీక్ష రోజు ముందుగా ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి.
- వీలైతే పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు సమాధానాలు రివ్యూ చేసుకోవాలి.
- సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే మార్క్ ఫర్ రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి.. చివర్లో సమాధానాల రివ్యూ సమయంలో నిశ్చితాభిప్రాయానికి వచ్చి సదరు సమాధానాన్ని సేవ్ చేయాలి.
జేఈఈ – అడ్వాన్స్‌డ్–2024.. ముఖ్య తేదీలు
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: 2024, మే 17 – 26
- జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ: 2024, మే 26 (పేపర్–1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్–2 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు)
- ఫలితాల వెల్లడి: 2024, జూన్ 9
- జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ: 2024, జూన్ 10 నుంచి
- వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in
PUC and B. Tech Admissions: పీయూసీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్.. ముఖ్యాంశాలు
- ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో కొశ్చన్స్ సాధన చేయాలి.
- ఇంటీజర్స్, ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- కనీసం రెండు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
- అన్ని సబ్జెక్ట్‌లలో, అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
- పరీక్ష రోజు హాల్లోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకోవాలి.
- మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
- పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి.
- మొదటి పేపర్ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి.
TS EAPCET 2024 Results Details: ఈఏపీసెట్ ఫలితాలు సమాచారం.. ‘కీ’పై అభ్యంతరాలకు నేటివరకు గడువు
Tags
- JEE Advanced
- Entrance Exam
- Engineering Admissions
- revision and practice
- JEE Mains
- advanced exam date
- JEE Mains Results
- Rules
- preparation for JEE Advanced
- Practice Test
- Mock Tests
- JEE Advanced weightage
- students education
- engineering entrance exam
- Education News
- Sakshi Education News
- JEE Advanced Exam 2024
- JEE Advanced Updates
- JEEAdvanced2024
- JEEMains
- ExamTips
- Qualifying Exams
- preparation plan
- TimeManagement
- Practice Questions
- SelfConfidence
- Revision
- HealthyLifestyle
- SakshiEducationUpdates