TS Open Schools: ఓపెన్‌ స్కూల్‌ ఓ వరం

విద్యారణ్యపురి: మధ్యలో చదువు ఆపేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ విద్యావిధానం ఓ వరం అని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై అన్నారు.
ఓపెన్‌ స్కూల్‌ ఓ వరం

 జూలై 31న‌ హనుమకొండలోని డీఈఓ కార్యాలయంలో ఓపెన్‌స్కూల్‌ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ మురాల శంకర్‌రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఈఓ అబ్దుల్‌హై మాట్లాడుతూ.. ఓపెన్‌ స్కూల్‌ విద్య సులభంగా ఉంటుందని ఆసక్తి ఉన్న అభ్యర్థులు టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలని సూచించారు.

చదవండి: Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లపై అవగాహన కల్పించాలి

ప్రవేశాలు పొందేవారు తమ మండలాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు అధ్యయన కేంద్రాలుగా ఉన్నాయని, ఆయా కో–ఆర్డినేటర్లను స ంప్రదించి వారి సూచనల మేరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలన్నారు. ఆగస్టు 10వరకు గడువు ఉందని, అపరాధ రుసుముతో ఆగస్టు 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు.

చదవండి: National Education Policy: అత్యంత ఆధునిక సౌకర్యాలతో వర్చువల్ ఓపెన్ స్కూల్‌ ప్రారంభం

కార్యక్రమంలో ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ మురాల శంకర్‌రావు, డీఈఓ కార్యాలయం సూపరింటెండెంట్‌ పి.శైలజ, డీఈఓ కార్యాలయం సెక్టోరియల్‌ కో–ఆర్డినేటర్లు ఎ.శ్రీనివాస్‌రెడ్డి, బి.రాధ, సునీత, శ్రీనివాస్‌, పద్మ, అవినాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags