Skip to main content

TS ICET 2024 Date Extended: టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు,చివరి తేదీ ఎప్పుడంటే..

TS ICET 2024 Date Extended  Council of Higher Education extends TSISET application deadline to May 7

తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ఐసెట్‌)–2024 దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మే 7వ తేదీ వరకు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గతంలో ఏప్రిల్‌ 30 వరకు అప్లికేషన్లు స్వీకరించగా, తాజాగా ఆ గడువును మే 7వరకు పొడిగించారు.

విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 


అర్హత: ఎంబీఏకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంసీఏకు కనీసం 50శాతం మార్కులతో ఇంటర్‌/డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌తో బీసీఏ/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: మే 7
దరఖాస్తు రుసుము: రూ. 750 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.550)


రూ.250 ఆలస్య రుసుంతో దరఖాస్తు చివరి తేదీ: మే 17.
రూ.500 ఆలస్య రుసుంతో దరఖాస్తు చివరి తేదీ: మే 27.

హాల్‌టికెట్స్‌ విడుదల: మే 28
పరీక్ష తేదీలు: జూన్‌ 5,6

Published date : 02 May 2024 01:46PM

Photo Stories