Skip to main content

TG ICET 2024: ఐసెట్‌ ద్వారా 87 శాతం సీట్ల భర్తీ.. సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీలోగా రిపోర్టు చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో 87.2 శాతం సీట్లు భర్తీ చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన వెల్లడించారు.
TS ICET 2024 round 1 allotment result

ఈ మేరకు సీట్ల కేటాయింపు వివరాలను ఆమె సెప్టెంబ‌ర్ 13న‌ ప్రకటించారు. ఎంబీఏలో 27,951 సీట్లు అందుబాటులో ఉంటే, 24,457 సీట్లు భర్తీ చేశారు. ఎంసీఏలో 6,797 సీట్లు అందుబాటులో ఉంటే, 5,843 సీట్లు భర్తీ చేశారు.

చదవండి: TS CPGET 2024: పీజీ సీట్ల రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

ఎంబీఏలో ఇంకా 3,494, ఎంసీఏలో 954 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 91 కళాశాలల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐసెట్‌కు ఈ ఏడాది 71,647 మంది అర్హత సాధించారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌ర్ 28వ తేదీలోగా రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.  

Published date : 16 Sep 2024 10:26AM

Photo Stories