TS Inter Admissions 2024-25 Details : అలెర్ట్.. ఇంటర్ అడ్మిషన్స్ ప్రారంభం..షెడ్యూల్ విడుదల.. ఈ సారి మాత్రం ఇలాగే..
మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూలు ప్రకారం మే 9వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 1వ తేదీ తేదీ నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
మొదటి దశ అడ్మిషన్లు జూన్ 30వ తేదీ వరకు పూర్తి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు పదో తరగతిలో సాధించిన గ్రేడ్స్, రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలని ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డ్ సూచించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అకడమిక్ యాన్యువల్ క్యాలెండర్‌ను మార్చి 30వ తేదీన విడుదల చేసింది.
ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్ విద్యా సంవత్సరం 2024 జూన్ 1వ తేదీ ప్రారంభమై.. 2025 మార్చి 29వ ముగియనుంది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం పని దినాలు 227గా ఉండనున్నాయని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది కూడా కాలేజీలకు సెలవులు భారీగానే ఉన్నాయి.
ఇంటర్ పరీక్షలు ఇలా..
ఇంటర్ అర్ధవార్షిక పరీక్షలు నవంబర్ 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు 2025 జనవరి 20 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మాత్రం మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ విద్యార్థులకు సెలవులు- పరీక్షలు ఇలా..
ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉండనున్నాయి. అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 11 నుంచి 16 వరకు ఉండనున్నాయి. అలాగే వివిధ పండగ సెలవులు తేదీలను బట్టి ఇవ్వనున్నారు. అలాగే 2025 వేసవి సెలవులు మాత్రం మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల పూర్తి షెడ్యూల్ 2024-25 ఇదే..
Tags
- ts inter admissions 2024
- TS Inter Admissions 2024-25
- ts intermediate admission 2024 25 schedule
- ts intermediate admission 2024 25 notification
- ts intermediate admission last date 2024
- Telangana Intermediate Board announces admission schedule for academic year 2024 25
- ts inter latest news
- ts intermediate academic calendar 2024 25 details in telugu
- ts intermediate academic calendar news telugu
- ts inter classes start date 2024
- ts inter classes start date 2024 news telugu
- TS Inter Admissions 2024 Important Dates
- TS State Intermediate Board
- Telangana
- Inter-admissions
- First-year admissions
- Intermediate General courses
- Intermediate Vocational courses
- Academic year 2024-25
- Sakshi Education Updates