Deepthi: ఓపెన్ స్కూల్ విద్యార్థులు పోటీ పడి చదవాలి
Sakshi Education
కర్నూలు సిటీ: ఓపెన్ స్కూల్ విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులతో పోటీ పడి చదవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి సూచించారు.
జనవరి 21న నగరంలోని ఓ ఓపెన్ స్టడీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఓపెన్ స్కూల్ ద్వారా చాలా మందికి చక్కగా ఉపయోగపడుతోందన్నారు.
చదవండి: A.P. Open School Society: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్ విడుదల
ఓపెన్ టెన్త్ పూర్తి చేసుకున్న వారు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వారి మెయిల్‌కు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాల వివరాలు వస్తుంటాయన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ చంద్ర భూషణ్ రావు, ప్రిన్సిపాళ్లు విజయ్‌కుమార్, జీవన జ్యోతి, రహమాన్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 23 Jan 2024 09:38AM