Inspiration Story: నా ఫస్ట్‌ ప్రయారిటీ వీళ్ల‌కే.. ఒక్క మాటలో చెప్పాలంటే..

విధి నిర్వహణలో వారికి వారే సాటి. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతూనే.. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ పోరులో వీరు పోషిస్తున్న పాత్ర పోషించారు.
VC. Sajjanar, IPS Family

అలాగే రాత్రింబవళ్లూ ప్రజాసేవలో తరిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ  సీపీ సజ్జనార్, ఐపీఎస్ స‌క్సెస్ స్టోరీ..

ఒక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు విధి నిర్వహణలోనూ తమదైన విభిన్నత చాటుతున్నారు. అలాగే వివిధ వ‌ర్గాల‌ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈయ‌న సతీమణి సైతం వేనోళ్ల కొనియాడుతున్నారు. వీరి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలకు, కుటుంబానికి సమయం కేటాయించడంలేదనే భావన ఉన్నా.. ప్రజల కోసం పని చేస్తుండడం గర్వంగా ఉందని చెబుతున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ  సీపీ సజ్జనార్ సతీమణి అనూప తమ మనోగతాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.

మా డాడీ గ్రేట్ అంటున్నారు..


కరోనా వైరస్‌ నియంత్రణలో పోలీసు సిబ్బంది సేవలకు సలామ్‌ చేస్తున్నాం. సిబ్బందికి మావారు నాయకత్వం వహించడం చాలా గర్వంగా ఉంది. ఐపీఎస్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా విధులను అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. కరోనా నియంత్రణలోనూ బాగా కష్టపడుతున్నారు. అలాగే మిగతా పోలీసు సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. బయట తిరగవద్దు. అప్పుడూ వీళ్లకు కూడా బాగుంటుంది. కుటుంబపరంగా చూసుకుంటే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త సమయం తక్కువగానే ఉంటారు. ముఖ్యంగా మా అమ్మాయిలు అదితి, నియతి.. డాడీ.. డాడీ అంటూ కలవరించేవారు. అయితే డాడీ విధులు తెలిశాక గ్రేట్‌ అంటున్నారు.

ఆయ‌న ఫస్ట్‌ ప్రయారిటీ వీళ్ల‌కే..
వర్క్‌హాలిక్‌ మైండ్‌ సెట్‌ ఉన్న మావారు.. ప్రజలకే ఫస్ట్‌ ప్రయారిటీ ఇస్తారు. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎప్పుడూ విధులతో బిజీగా ఉండే మావారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా ఉడికించిన కోడిగుడ్లు, కూరగాయలు ఇష్టంగా తింటారు. ఉదయం వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తుంటారు. ఆమ్లా జ్యూస్, ఇమ్యూనిట్‌ బూస్ట్‌ తీసుకుంటారు. సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీలైతే వార్తలు చూస్తుంటారు. విధులకు వెళ్లి లేట్‌గా వచ్చినా పిల్లలతో కొంతసేపు క్యారమ్‌ ఆడాక నిద్రకు ఉపక్రమిస్తారు.

ఒక్క మాటలో..


తెల్లవారుజామున మానిటరింగ్‌ మొదలై.. అర్ధరాత్రి వరకు టెలీ కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉంటున్నారు. అందుకే మా అమ్మాయిలు డాడీతో కొంతసేపైనా ఉండాలన్న ఉద్దేశంతో ఉదయం లేవగానే డాడీ వాహనంలో ఒక రౌండ్‌ వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా కచ్చితంగా హ్యాండ్‌ శానిటైజింగ్‌ చేయాల్సిందే. కాళ్లు, చేతులు కడుక్కొవాల్సిందే. ఇక మావారు బయటి నుంచి ఇంటికి రాగానే యూనిఫాం శానిటైజ్‌ చేసి సపరేట్‌గా పెట్టేస్తారు. స్నానం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్వారంటైన్‌ అవుతారు. చివరగా ఒక మాట ఇంట్లోనే ప్రజలు ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. కరోనాను జయించాలి.

ఏ సమయంలోనైనా...
గతంలో కుటుంబ సభ్యులతో గడిపిన విధంగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏ సమయంలోనైనా విధి నిర్వహణకు వెళ్లాల్సిందే. గతంలో ప్రతిరోజూ అరగంట పాటు ఆడుకోనేదే ఊరుకునేవారు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కాస్త దూరంగా ఉండాల్సి వస్తోంది. సమయంతో సంబంధం లేకుండా సిబ్బందికి మార్గదర్శకాలిస్తున్నాం.
        
దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా..


సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్ గా త‌న‌దైన మార్క్ చూపించారు. ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇటీవలే ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు. వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. మల్టీ లెవెల్ స్కాములను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.

టీఎస్ఆర్టీసీ ఎండీగా..సాధార‌ణ వ్యక్తిలా..


సాధారణ వ్యక్తిలా ప్రయాణించి క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సేవలను పరిశీలిస్తున్నారు. అలాగే సంస్థ బాగు కోసం సజ్జనార్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బస్సులలో ఇటీవల జన్మించిన ఇద్దరు ఆడపిల్లలు తమ ‘బర్త్‌డే’ కానుకగా సంస్థ  నుంచి ఉచిత జీవితకాల పాస్‌లను అందించారు. అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్‌లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్‌ స్పందిస్తూ తనదైన స్టైల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్టీసిని ప్రశంసలతో ముంచెత్తాడు. కూతురు వివాహానికి టీఎస్‌ఆర్టీసీ బస్‌ బుక్ చేసుకున్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు కూడా. అలాగే సంస్థను లాభాల పట్టించేదుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కావాల్సిన చర్యలను మొదలు పెట్టారు. ఈ సారి ఆయన సోషల్ మీడియాని ఎంచుకున్నారు.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

#Tags