Kritika Shukla, IAS: ఓ అమ్మాయిగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా.. నేను ఈ స్థాయికి వచ్చానంటే..

గట్టి చట్టానికి గట్టి ఆఫీసర్.. కృతికా శుక్లా! ఎలా అప్పుడే గట్టి ఆఫీసర్ అని చెప్పడం?! మగవాళ్ల వేధింపులు ఎలా ఉంటాయో.. ఆడపిల్ల అనుభవించే వేదన ఎలా ఉంటుందో.. ఆమెకు తెలుసు.
Kritika Shukla, IAS

తనూ ఒకప్పుడు వెకిలి చూపులకు.. వికృతపు మాటలకు భయపడిన అమ్మాయే! ఇప్పుడా భయాన్ని పోగొట్టేందుకు దిశ చట్టం ఉంది. దుష్టశిక్షణకు స్వయంగా ఆమే డ్యూటీలో ఉంది!

కృతిక జమ్మూ అండ్‌ కశ్మీర్‌ కేడర్‌ 2013 ఐఏఎస్‌ ఆఫీసర్‌. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ' ఏపీ దిశ చట్టం – 2019 ' అమలుకు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు కూడా...

నేను చదువుకునే రోజుల్లో ఎన్నో..


ఢిల్లీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిగా నేనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈవ్‌టీజింగ్‌ ఉండేది. బస్సు ప్రయాణంలో అసభ్యకరమైన చేష్టలు ఉండేవి. కొంచెం పరిచయం అయితే చాలు.. పిచ్చి పిచ్చి మెసేజ్‌లు వచ్చేవి. ఇలా ఉండేది హెరాస్‌మెంట్‌. హాస్టల్‌ దగ్గరికి కూడా అబ్బాయిలు వచ్చేవారు. దాంతో మేము మెంటల్‌గా చాలా డిస్టర్బ్‌ అయ్యేవాళ్లం. మా సమస్యను చెప్పుకొనేందుకు అప్పట్లో మహిళా పోలీసులు ఉండేవాళ్లు కాదు. ట్రావెల్‌ చేసేటప్పుడు రక్షణగా ఉమెన్‌ వింగ్‌ ఉండేది కాదు. ఆపద సమయంలో ఆదుకొనేందుకు కనీసం హెల్ప్‌ నంబర్లు ఉండేవి కావు.

నేను నా జీవితంలో ప‌డిన ఇబ్బందుల‌ను..
ఏపీ 'దిశ' చట్టాన్ని రూపొందించేటప్పుడు నేను నా జీవితంలో పడిన ఆనాటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అలాంటి వేధింపులు ఇప్పటి అమ్మాయిలకు పునరావృతం కాకుండా, పురుషుల ప్రవర్తనలో సమూల మార్పులు తెచ్చేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించాం. నేను చదువుకునే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులు, అనుభవాలు ఈ చట్టం రూపకల్పనలో నాకెంతగానో తోడ్పడ్డాయి.

మేము ఇద్దరం అమ్మాయిలమే.. అయినా కూడా..


మాది పంజాబ్‌లోని చండీగఢ్‌. పాఠశాల విద్య వరకు అక్కడే చదివాను. నాన్న మదన్‌లాల్‌ బాత్రాకి స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ బ్రాంచ్‌ ఉండేది. అమ్మ హర్షా బాత్రా గవర్నమెంట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌. చండీగఢ్‌లోనే పనిచేసేవారు. మేము ఇద్దరం అమ్మాయిలమే. మా చెల్లెలు రీచా బాత్రా ఇప్పుడు హైదరాబాద్‌లోని నొవారిటీస్‌లో మేనేజర్‌. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ తరువాత మా మిగతా చదువులన్నీ ఢిల్లీలోనే సాగాయి. మేమిద్దరం అమ్మాయిలమే అయినప్పటికీ మా అమ్మ పట్టుదలతో మంచి చదువు చెప్పించాలని.. దూరమైనప్పటికీ మమ్మల్ని ఢిల్లీ పంపింది. నేను అక్కడి శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివాను.

రూ.15 లక్షలకు పైగా ఆఫర్‌ను వ‌దులుకుని..
ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండి చదువుకున్నాను. డిగ్రీ పూర్తి కాగానే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సంవత్సరానికి రూ. 15 లక్షలపైగా ప్యాకేజీ ఆఫర్‌ కూడా వచ్చింది. ఐఎఎస్‌కి కూడా మా అమ్మ ప్రోత్సాహంతోనే నేను ప్రిపేర్‌ అయ్యాను. ఐఎఏస్‌లో ఉద్యోగ సంతృప్తి మాత్రమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అమ్మ చెప్పేవారు. పదిమంది పేదలకు మంచి చేసే భాగ్యం లభిస్తుందని అనేవారు. దాంతో నాకు ఐఏఎస్‌ చదవాలనే సంకల్పం బలంగా ఏర్పడింది. అమ్మ ఇచ్చిన ప్రేరణ, ప్రోత్సాహంతోనే నేను 23 ఏళ్లకే ఐఏఎస్‌ పాస్‌ అయ్యాను’’.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

మా వివాహం..
మాది ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజి. నా భర్త హిమాన్షు శుక్లాది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌. మా ఐఏఎస్‌ ట్రైనింగ్‌ అయిన తరువాత పెద్దల అంగీకారంతో 2015 లో పెళ్లి చేసుకున్నాం. రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. హిమాన్షు నా పని ఒత్తిడి అర్థం చేసుకొని నాకు హెల్ప్‌ చేస్తుంటారు. ఇద్దరం కలిసి వంట చేసుకుంటాం. నేను గర్భిణిగా ఉన్నప్పుడు ఆయనే నా డైరెక్షన్‌తో వంట చేసేవారు. వడ్డించేవారు. ఇంటి పనిని కూడా షేర్‌ చేసుకుంటాం. ఒక్కోసారి నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుంది. అప్పుడు ఆయనే బాబును సముదాయిస్తుంటారు.

ఏది తప్పు, ఏది ఒప్పు అనేది..
అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల్నీ చూసే మార్పు ఇంట్లోంచే మొదలవ్వాలి. ఇంటి పనంతా అమ్మాయిలదే అనే భావనను అబ్బాయిల్లో పోగొట్టి, వాళ్లకూ బాధ్యతల్ని అప్పగించాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని రెస్పెక్ట్‌ చెయ్యడం నేర్పాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులు గైడ్‌ చేయాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియజెప్పాలి. అమ్మాయిల్ని వేధిస్తే జరగబోయే పరిణామాలను కూడా వివరించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అని ముగించారు కృతికా శుక్లా.

తక్షణ స్పందన..


దిశ చట్టం అమలుకు ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్‌ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్‌ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు. 'దిశ' చట్టానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా నాకు బాధ్యతను అప్పగించడాన్ని మంచి అవకాశంగా భావించాన‌ని కృతికా శుక్లా అన్నారు. ముఖ్యమంత్రి సూచనలు, సలహాలతో మార్పులు, చేర్పులు చేసి వారం వ్యవధిలోనే దిశ బిల్లును తయారు చేశాం. అది మా మొదటి విజయం. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం పోలీసుశాఖ, న్యాయశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఫోరెన్సిక్‌ సంస్థల సమన్వయంతో పని చేయబోతున్నాం. ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకుంటాం. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా ఉన్న కృతికా శుక్లాకు దిశ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు కూడా..

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

ప్రతి జిల్లాలో..
దిశ చట్టం అమలు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టేశాం. ప్రతి జిల్లాలో దిశ ఉమెన్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్టేషన్‌లో ఓ డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, సైబర్‌ ఎక్స్‌పర్ట్‌ ట్రైనర్, సపోర్టు స్టాఫ్‌ ఉంటారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ సదుపాయం, బాధితురాలికి కౌన్సెలింగ్, వైద్య పరీక్షల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి జిల్లాలో దిశ కోర్టును ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడులపైన వెంటనే విచారణ చేపడతాం. మహిళలకు ఈ చట్టం ఖచ్చితంగా భరోసా ఇస్తుందని నమ్ముతున్నాం. ఈ చట్టం ద్వారా మహిళలను చైతన్యం చేయబోతున్నాం.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

వివిధ బాధ్యతల్లో..
☛ డైరెక్టర్, ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌.
☛ మేనేజింగ్‌ డైరెక్టర్, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ.
☛ మేనేజింగ్‌ డైరెక్టర్, జువెనైల్‌ వెల్ఫేర్‌.
☛ డైరెక్టర్, వెల్ఫేర్‌ ఆఫ్‌ రిఫరెండ్లీ ఎయిడెడ్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌
☛ మేనేజింగ్‌ డైరెక్టర్, డిఫరెంట్లీ ఎయిడెడ్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ అసిస్టెంట్స్‌ కార్పొరేషన్‌
☛ స్పెషల్‌ ఆఫీసర్, దిశ

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

#Tags