Inspirational UPSC Civils Ranker Success Story : నా అంగ‌వైకల్యం నా శ‌రీరానికే.. నా ల‌క్ష్యానికి కాదు.. ఈ క‌సితోనే సివిల్స్ కొట్టానిలా..

అంగ‌వైకల్యం శ‌రీరానికే..కానీ మ‌న ల‌క్ష్యానికి కాద‌ని నిరూపించింది కేర‌ళ రాష్ట్రంలోని మలబార్‌ జిల్లాకు చెందిన కాజల్‌ రాజు. ఒక వైపు అంగ‌వైకల్యం బాధిస్తున్న‌.. మ‌రో వైపు ఒక బ‌ల‌మైన సంక‌ల్పంతో యూపీఎస్సీ సివిల్స్‌-2022 ఫ‌లితాల్లో ఆల్ ఇండియా 910వ ర్యాంక్ సాధించారు కాజల్‌. ఈ నేప‌థ్యంలో కాజల్‌ రాజు స‌క్సెస్ స్టోరీ మీకోసం..
UPSC Civils Ranker Kajal Raju Success Story

దేశంలో అత్యంత క‌ష్ట‌మైన యూపీఎస్సీ సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి స‌త్తాచాటారు ఈమె. శరీరంలో ఏ అవయవం లోపించినా.. ఇక తమ జీవితం వ్యర్థమన్న నిరాశలోకి కూరుకుపోతుంటారు చాలామంది. కానీ తమలో ఉన్న ప్రతిభ, పట్టుదలతో ఈ లోపాల్ని అధిగమించి స‌క్సెస్ సాధిచారు ఈమె.

కుటుంబ నేప‌థ్యం :
కాజల్‌ రాజు.. మలబార్‌ జిల్లాలోని నీలేశ్వర్‌ నా స్వగ్రామం. ఈమె కుడిచేతి మణికట్టు లేకుండానే జన్మించిందామె. పుట్టుకతోనే అరుదుగా వచ్చే ఫొకోమేలియా సిండ్రోమ్‌ అనే సమస్య ఇది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజ‌యం సాధించింది ఈమె.

☛ UPSC Civils Ranker Akhila Success Story : ప్రమాదంలో చేయిని కోల్పోయా..ఒంటి చేత్తోనే.. పోరాటం.. సివిల్స్ కొట్టానిలా..

తొలి ప్రయత్నంలోనే..

స్కూల్లో ఉన్నప్పుడే భవిష్యత్తులో జిల్లా కలెక్టర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఐఐటీ మద్రాసులో చదివా. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కి అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. అయినా మళ్లీ తదుపరి పరీక్షలో మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నిస్తా. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు నేను చెప్పేది ఒక్కటే.. రోజూ వార్తాపత్రికలు చదవండి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు పెంచుకోండి. సమాజంలో ఏం జరుగుతోందో గ్రహించండి. అంటూ.. నేటి యువతకు మార్గనిర్దేశనం చేస్తోందీ ఈ సివిల్స్‌ ర్యాంకర్.. కాజల్‌ రాజు.

☛ Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ ప‌ని చేశా.. చివ‌రికి ఇలా చ‌దివి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

నా సివిల్స్ ఇంట‌ర్య్వూలో..

అక్కడ ‘థెయ్యం’ అనే సంప్రదాయ నృత్య వేడుకను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు పాల్గొనడం ఆనవాయితీ. అయితే నా అభిరుచుల్లో భాగంగా దీని గురించి ప్రస్తావించిన నాకు.. ఇంటర్వ్యూలో ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. ఇది కేవలం పురుషుల నృత్య వేడుక అని, మహిళలు చేయరని.. ఇలా దీనికి సంబంధించిన విషయాలను అర్థవంతంగా వివరించా. నా విశ్లేషణాత్మక నైపుణ్యాలు ముఖాముఖి బృందానికి నచ్చాయి.

☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

సాధారణంగా ఇంటర్వ్యూల్లో మన మెదడుకు పదును పెట్టే ప్రశ్నలతో పాటు.. మన అభిరుచుల పైనా ప్రశ్నలడుగుతుంటారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అలాంటి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చి.. ముఖాముఖి చేసే వారి మనసులు గెలుచుకోవడంతో పాటు.. అంతిమ ఫలితాల్లో 910 ర్యాంకు సాధించినుందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. మ‌న శ‌రీరానికి అంగ‌వైకల్యం ఉన్న ప‌ర్వాలేదు కానీ.. మ‌న ల‌క్ష్యానికి.. మ‌న మ‌న‌స్సుకు ఉండ‌కుడ‌ద‌న్నారు.

➤☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

#Tags