Tenth Board Exams: టెన్త్‌ విద్యార్థుల బోర్డు పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం..

మార్చిలో ప్రారంభం కానున్న టెన్త్‌ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులకు పరీక్ష సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కమిటీ సభ్యులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌ ఆదేశించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సోమవారం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ కమిటీ సమావేశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 112 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Work Shop: మోహన్‌బాబు యూనివర్సిటీలో పారామెడికల్‌ విద్యార్థులకు వర్క్‌షాప్‌

ప్రైవేటు, రెగ్యులర్‌ విద్యార్థులు 10,871 మంది బాలురు ,10,242 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. 61 పరీక్షా కేంద్రాలు బీ కేటగిరి, 51 పరీక్ష కేంద్రాలు సీ కేటగిరీలో ఉన్నాయన్నారు. 24 పోలీస్‌ స్టేషన్లలో ప్రశ్నపత్రాలను భద్రత పరుస్తామని చెప్పారు. కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ స్టోరేజ్‌ పాయింట్‌గా స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను ఎంపిక చేశామన్నారు. కపిలేశ్వరపురం మండలంలో ఒక పరీక్ష కేంద్రాన్ని సమస్యాత్మకంగా గుర్తించామని చెప్పారు. 112 పరీక్షా కేంద్రాలలో ఫర్నిచర్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌ శాఖ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి, బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్‌ సెంటర్లు పరీక్ష సమయాలలో మూసి వేయించాలని సూచించారు.

Inspire Competitions: ఇన్స్‌పైర్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని..

పరీక్ష కేంద్రాలన్నింటిలో తాగునీరు ,రన్నింగ్‌వాటర్‌తో మరుగుదొడ్లు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా పరీక్షా కేంద్రాల రూట్లలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆయా శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లను స్క్వాడ్‌ సిబ్బందిని విద్యాశాఖ అధికారులు నియమించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను నియమించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని ఆమె సూచించారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంపొందించే దిశగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

Tabs for Students: విప్లవాత్మకమైన మార్పు కోసం విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణి..

సీడీ గ్రేడ్‌ విద్యార్థుల కోసం రోజువారీ రివిజన్‌ పరీక్షలను నిర్వహించాలన్నారు. జిల్లా అడ్మిన్‌ ఎస్పీ ఖాదర్‌ బాషా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎం. సురేష్‌, జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు సెక్రటరీ బి.హనుమంతరావు, డీటీవో అశోక్‌ ప్రతాప్‌రావు, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి సీహెచ్‌ వీరాంజనేయ ప్రసాద్‌, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీహెచ్‌ భరతలక్ష్మి పాల్గొన్నారు.

#Tags