Skip to main content

Work Shop: మోహన్‌బాబు యూనివర్సిటీలో పారామెడికల్‌ విద్యార్థులకు వర్క్‌షాప్‌

పారామెడికల్‌ కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌ను దాసరి ఆడిటోరియంలో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. అమరన్‌ ఆస్పత్రి ఎమెర్జెన్సీ హెచ్‌ఓడీ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు..
Emergency HOD of Amaran Hospital addressing students   Students participating in workshop with Emergency HOD Shiva RamaKrishna speaking to students at work shop in MBU   Paramedical College Workshop in Dasari Auditorium

సాక్షి ఎడ్యుకేష‌న్‌: మండల పరిధిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)లో సోమవారం బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ అనే అంశంపై పారామెడికల్‌ కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌ను దాసరి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమరాన్‌ ఆస్పత్రి ఎమెర్జెన్సీ హెచ్‌ఓడీ డాక్టర్‌ శివరామకృష్ణారెడ్డి విచ్చేసి, ప్రసంగించారు.

Inspire Competitions: ఇన్స్‌పైర్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని..

దైనందిన జీవితంలో మనిషికి అనుకోకుండా శ్వాస ఇబ్బంది, కళ్లు తిరగడం, బీపీ పెరగడం లేదా తగ్గడం వంటి వాటి వల్ల గుండె సమస్య ఏర్పడుతుందన్నారు. అలాంటి సమయంలో మనిషిని ఎలా కాపాడుకోవాలో ఆయన వివరించారు. కార్యక్రమం పారామెడికల్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ మానస్‌ చక్రవర్తి, ఎంబీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సారథి, అధ్యాపకులు, ఫిజియోథెరపీ విభాగధిపతి డాక్టర్‌ చంద్రకళాధర్‌రెడ్డి, పాల్గొన్నారు.

Published date : 13 Feb 2024 11:00AM

Photo Stories