Polytechnic College Spot Admissions : పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు.. ప్రవేశ పరీక్షకు హాజరుకాని వారు..!
గుంటూరు: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకరరావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరు కాకున్నప్పటికీ, స్పాట్ అడ్మిషన్ల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీసు, అప్పెరల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో తక్షణ ప్రవేశాలకు షెడ్యూల్ ప్రకటించినట్లు తెలిపారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను నోటీసుబోర్డులో ఉంచినట్లు పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థినులు టెన్త్ మార్కుల జాబితా, నాలుగో తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్‌కార్డు ఒరిజినల్‌తో పాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలతో ఈనెల 31 ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ కోసం విద్యార్థినులు రూ.6,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Tags
- Polytechnic College
- admissions
- July 31
- Spot Admissions
- Tenth Students
- non polycet candidates
- Govt Women's Polytechnic College
- principal prabhakar rao
- polycet admissions
- tenth passed out students
- polycet spot admissions
- Education News
- Sakshi Education News
- GovernmentWomensPolytechnic
- Gujjanagundla
- SPrabhakaraRao
- AdmissionOpportunity
- July31
- Guntur
- Gujjanagundla
- SpotAdmissions
- RemainingSeats