Admissions in APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు.. ఉచిత విద్య, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎస్‌వోఈ/సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితోపాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

గురుకుల పాఠశాలలు
కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(పీజీటీ), మల్లి; స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం; స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం(జోగింపేట); కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట; స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి; స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్‌; కాలే జ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, తనకల్లు.

మొత్తం సీట్ల సంఖ్య:780(ఇంటర్‌ ఎంపీసీ-300, ఇంటర్‌ బైపీసీ-300, ఎనిమిదో తరగతి-180).
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

పరీక్ష విధానం: ఎనిమిదో తరగతికి ఏడో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు(10 మార్కులు), ఇంగ్లిష్‌(10 మార్కులు), హిందీ(10 మార్కులు), మ్యాథ్స్‌(20 మార్కులు), ఫిజికల్‌ సైన్స్‌(15 మార్కులు), బయో సైన్స్‌(15 మార్కులు), సోషల్‌ స్టడీస్‌(20 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్‌కు పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌(20 మార్కులు), మ్యాథ్స్‌(40 మార్కులు), ఫిజికల్‌ సైన్స్‌(20 మార్కులు), బయో సైన్స్‌(20 మార్కులు) సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.03.2024.
హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభతేది: 30.03.2024.
ప్రవేశ పరీక్ష తేది: 07.04.2024.
వెబ్‌సైట్‌: https://twreiscet.apcfss.in/
 

చదవండి: Admissions in Telangana Model Schools: ఆరు నుంచి పదో తరగతిలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

#Tags