Skip to main content

Admissions in BC Gurukul Colleges: బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు

13 Boys Junior Colleges & 13 Girls Junior Colleges in Karimnagar District   Admissions in BC Gurukul Colleges   Apply for Telangana BC Welfare Gurukula Colleges

సిరిసిల్లటౌన్‌: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌సీవో గౌతం కుమార్‌రెడ్డి, డీసీవో శ్రీనాథ్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 2024–25 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశానికి MJPTBCWRJC-2024 వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 బాలురు, 13 బాలికల జూనియర్‌ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు.

డీగ్రీ కాలేజీలో ప్రవేశాలు..
బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులైన ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. www.mjptbcwreis.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు రుసుం రూ.200 చెల్లించి ఏప్రిల్‌ 12వ తేదీలోపు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

Published date : 19 Mar 2024 04:12PM

Photo Stories