High Salary Jobs : రూ.6.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఫేస్‌బుక్‌లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ ఆసక్తికరమైన స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
అర్హత లేని వ్యక్తిగా..
మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్‌బుక్‌లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు.ఫేస్‌బుక్‌లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్‌గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు.
☛ Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వచ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!
☛ Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..
దీనికి మించి ఇంకా..
ఫేస్‌బుక్‌లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్‌లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను. ఇంజినీరింగ్‌కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ రాహుల్ పాండే తీసుకున్న నిర్ణయం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.