Skip to main content

Software Employee Success Story : ఒక మారుమూల గిరిజన బిడ్డ.. ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం కొట్టాడిలా..

ల‌క్ష్యంపై క‌సి.. సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉంటే.. ఏదైన సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించాడు ఈ యువ‌కుడు. ప్ర‌ముఖ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఈ యువ‌కుడి పేరు ప్రశాంత్‌నాయక్‌.
Angothu Prashant Nayak Success Story in Telugu,Inspiring Success Story, Career Success
Angothu Prashant Nayak

ప్రశాంత్‌నాయక్ ఒక మారుమూల గిరిజన తండాకు చెందిన వారు. ఈ నేప‌థ్యంలో ప్రశాంత్‌నాయక్ ఉద్యోగం సాధించేందుకు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు...? ఈయ‌న ఎడ్యుకేష‌న్ ఎలా సాగింది.. మొద‌లైన విష‌యాలు మీకోసం..

కుటుంబ నేప‌థ్యం:
ప్రశాంత్‌నాయక్‌..తెలంగాణ‌లోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని మారుమూల గిరిజన తండాకు చెందిన విద్యార్థి. తండ్రి ఆంగోతు మధునాయక్‌. త‌ల్లి సుజాత. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె.

Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..

ఎడ్యుకేష‌న్ :
ప్రశాంత్‌నాయక్‌.. చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో చదివాడు. 2019లో జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 467వ ర్యాంక్‌, జేఈఈ అడ్వాన్స్‌లో ఆలిండియా 245వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని ఐఐటీలో సీటు సాధించి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు.

☛ Samhita Microsoft Job Rs.52 lakh Salary :లక్కీ ఛాన్స్ అంటే ఈమెదే.. ప్ర‌ముఖ కంపెనీలో జాబ్.. రూ. 52 లక్షల జీతం.. ఎలా అంటే..?

ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలోనే ఉద్యోగం..
ప్రశాంత్‌నాయక్‌.. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జపాన్‌ దేశ రాజధాని టోక్యోలో ఉన్న యోకోగావా ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. జపాన్‌లో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ప్రశాంత్‌నాయక్‌ తల్లిదండ్రులు, తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వ‌చ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!

నా లక్ష్యం ఇదే..
జపాన్‌లో ఏడాదికి రూ.75 లక్షల జీతానికి ఇంజినీర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు ప్రశాంత్‌నాయక్‌. చిన్నతనం నుంచే సివిల్స్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని చ‌దివాను. ఎన్ని కష్టాలు వ‌చ్చినా సరే ఏదో ఒకరోజు కచ్చితంగా యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ నిర్వ‌హించే సివిల్స్‌ సాధించ‌డ‌మే నా ల‌క్ష్యం అన్నారు.

☛ ఇలాంటి మ‌రిన్ని స‌క్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 29 Sep 2023 09:48AM

Photo Stories