Skip to main content

College Holidays : మూడు రోజులు పాటు కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారీ వర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో కాలేజీల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మూడు రోజుల పాటు సెల‌వుల ప్ర‌క‌టించారు.
TS College Holidays
TS College Holidays

గత రెండు, మూడు రోజులుగా తెలంగాణలో ఎడ‌తెర‌పి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే.  ఈ వర్షాల పరిస్థితిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన  ప్రగతిభవన్ లో జూలై 10వ తేదీన (ఆదివారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జూలై 14వ తేదీ (గురువారం)నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

TS Inter Advanced Supplementary Exams Dates: ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..

చదవండి: జాతీయ విద్యా విధానంలో అన్ని భాషలకు ప్రోత్సాహం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అత్యధికంగా..

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్మల్‌లోని వానల్‌పహాడ్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ లో భన్సాయ్  56.8 మి.మీ,నిర్మల్‌లోని లోకేశ్వరం 55.3 మి.మీ, నిర్మల్‌లో ముధోల్ 53.8 మి.మీ,నిర్మల్‌లోని కుంటాల 52.8 మి.మీ. వర్షాపాతం నమోదైంది. నిర్మల్‌లోని తానూర్- 47 మి.మీ,నిజామాబాద్‌లోని మంచిర్యాల- 44.3 మి.మీ,కొమరం భీమ్ఆసిఫాబాద్‌లోని యెల్కపల్లె- 44 మి.మీ,భద్రాద్రి కొత్తగూడెంలోని టేకెలెపాలె- 44 మి.మీ,నిజామాబాద్‌లోని తొండకూరు- 43 మి.మీ,నిజామాబాద్‌లోని సీహెచ్ కొండూరు- 40.8 మి.మీ వ‌ర్ష‌పాతం శ‌నివారం రాత్రి న‌మోదైంది. 

What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవ‌లే కర్ణాటక రాష్ట్రంలోని  తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి) అతి భారీ వర్షాలు కురవ‌డంతో కోస్తా కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విష‌యం తెల్సిందే. పాఠశాలలు, కళాశాలలకు అధికారులు పూర్తిగా మూసేశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడిచారు.

TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

కీల‌క ఆదేశాలు జారీ..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులను అ‍ప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, ముంపు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక, శాశ్వత పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమీషనర్లను తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.

Schools Holidays : మూడు రోజులు పాటు పాఠశాలలు సెల‌వులు.. కార‌ణం ఇదే..

విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా..
భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని  అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. తీరప్రాంతాలు, మల్నాడు ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు నెకొరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. నదులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు వ్యవసాయ పొలాలును ముంచెత్తాయి.

Tenth and Inter: ఫెయిలైన విద్యార్థులకు ఓపెన్‌ స్కూల్‌ అవకాశం

Published date : 10 Jul 2022 06:35PM

Photo Stories