Schools Holidays : మూడు రోజులు పాటు పాఠశాలలు సెలవులు.. కారణం ఇదే..
గత రెండు రోజులుగా తెలంగాణలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూలై 10వ తేదీన (ఆదివారం) ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిస్థితిని బట్డి గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ లో...
ముఖ్యంగా తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో 40-50 మిల్లీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ తెలిపింది.
TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి) అతి భారీ వర్షాలు కురవడంతో కోస్తా కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెల్సిందే. పాఠశాలలు, కళాశాలలకు అధికారులు పూర్తిగా మూసేశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడిచారు.
సీఎం కీలక ఆదేశాలు జారీ..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, ముంపు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక, శాశ్వత పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమీషనర్లను తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా..
భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తీరప్రాంతాలు, మల్నాడు ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు నెకొరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. నదులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు వ్యవసాయ పొలాలును ముంచెత్తాయి.