Skip to main content

TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ జూన్ 29వ తేదీన విడుదల చేసింది.
TS Schools
TS School Academic Calendar 2022-23

ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను పరిశీలిస్తే..
➤ ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు
➤ ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
➤ వేసవి సెలవులు: ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు
➤ ప్రైమరీ స్కూల్స్‌: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు
➤ ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు
➤ ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు
➤ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు).. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి 16 రోజులు సెలవులు రానున్నాయి.
➤ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
➤ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు)

Published date : 29 Jun 2022 09:49PM

Photo Stories