Tenth and Inter: ఫెయిలైన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ అవకాశం
Sakshi Education
Tenth and Inter ఫెయిలైన విద్యార్థులకు ఓపెన్ స్కూల్‌లో ప్రవేశం పొందే అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐవోఎస్) ఒక ప్రకటనలో తెలిపింది.
టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ అవకాశం
ఈ కోర్సు పాసైన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హత పొందుతారని పేర్కొంది. ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రవేశాలు చేపడుతున్నట్టు వివరించింది. ఆసక్తిగల అభ్యర్థులు 040–24752859 ఫోన్ నంబర్‌ను సంప్రదించి, వివరాలు పొందవచ్చని లేదా https://nios.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చని NIOS సూచించింది.