Skip to main content

NIOS Virtual School: ఎన్‌ఐఓఎస్‌ వర్చువల్‌ స్కూల్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి?

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ)–2020 అమలులో ఏడాది కాలంలో సాధించిన విజయాలపై రూపొందించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్‌ సంయుక్తంగా ఆగస్టు 24న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.
ఈ నివేదికతోపాటు దివ్యాంగులకు ఉపయుక్తంగా ‘ప్రియా’ బుక్‌లెట్‌ ఆవిష్కరించారు. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) రూపొందించిన వర్చువల్‌ స్కూల్‌ను ప్రారంభించారు. వర్చువల్‌ లైవ్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ లాబ్‌ ద్వారా అధునాతన డిజిటల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను అందించే ఈ వర్చువల్‌ స్కూల్‌ దేశంలోనే మొదటిదని మంత్రి ధర్మేంద్ర వివరించారు.

11 కొత్త నైపుణ్య సబ్జెక్టులు...
వృత్తి విద్య, సాధారణ బోధన కోర్సుల మధ్య అంతరాన్ని చెరిపేస్తూ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020లో భాగంగా వినూత్న సబ్జెక్టులు అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు కోడింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ తదితర 11 కొత్త నైపుణ్య సబ్జెక్టులను బోధిస్తున్నట్టు, భవిష్యత్తులో మరిన్ని కొత్త నైపుణ్యాలకు సంబంధించి సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఐఓఎస్‌ వర్చువల్‌ స్కూల్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు?
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వర్చువల్‌ విధానం ద్వారా బోధన చేసేందుకు...
Published date : 25 Aug 2021 06:58PM

Photo Stories