US 9/11 Tragedy: ప్రపంచాన్ని కుదిపేసిన ఉగ్రదాడి.. నేటికి 23 ఏళ్లు, ఆరోజు అసలేం జరిగిందంటే..
వాషింగ్టన్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి 23 ఏళ్లు. అల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మూడు వేల మందికి పైగా జనం మృతి చెందారు. నాటి ఈ సంఘటన విషాదం నేటికీ అమెరికన్లను బాధపెడుతూనే ఉంది. ‘‘2001, సెప్టెంబరు 11’’.. ఇది అమెరికా చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ మరువలేని చీకటి దినం. ప్రాథమిక నివేదికల్లో ఈ ఘటనను విమాన ప్రమాదంగా పేర్కొన్నారు.
బోస్టన్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం 8.46 గంటలకు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొంది. ఇదిజరిగిన 17 నిమిషాల తర్వాత, అదే భవనంలోని సౌత్ టవర్‌ను మరో విమానం ఢీకొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇది ఉగ్రవాద దాడి అని స్పష్టమైంది.
ఆ రోజు ఆల్ ఖైదా ఉగ్రవాదులు మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేశారు. వారి లక్ష్యం న్యూయార్క్ నగరం మాత్రమే కాదు. పెంటగాన్, వైట్ హౌస్‌లను కూడా లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. అయితే వైట్‌హౌస్‌పై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నం విఫలమైంది.
మొత్తం మీద ఆ రోజు నాలుగు చోట్ల జరిగిన దాడుల్లో మూడు వేల మందికి పైగా జనం మృతిచెందారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన తర్వాత, ఆ ప్రదేశాన్ని గ్రౌండ్ జీరోగా పిలుస్తున్నారు. ఈ దాడి తర్వాత అమెరికా తీవ్రవాదంపై యుద్ధం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇందుకు అనుగుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ భయంకరమైన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. పెరల్ హార్బర్ తర్వాత అమెరికాపై జరిగిన అతిపెద్ద దాడిగా 9/11ను చెబుతారు.
Tags
- Terrorist attacks
- 9/11 attack
- Current Affairs
- September 11 attacks
- usa terror attacks
- What happened on 9/11?
- World Trade Center
- facts about September 11 terror attack
- September112001
- AlQaeda
- PlaneCrashReports
- 9/11tradegy
- 9/11Anniversary
- 9/11Victims
- Terrorism
- internationalnews
- america history
- blackday
- whitehouse
- groundzero
- sakshieducationlatest news
- 23rd anniversary of 9/11