Skip to main content

Govt and Private Schools : పాఠ‌శాల‌ల‌ను ప‌ట్టించుకోని విద్యాశాఖ అధికారులు.. విద్యా బోధ‌న ఇలా!

ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
Teachers should have eligible to teach students in schools

కర్నూలు సిటీ: ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీలకు మంగళం పాడి.. నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు పునఃప్రారంభం అయ్యే నాటికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్‌–ఎయిడెడ్‌ (ప్రైవేటు) పాఠశాలలను తనిఖీ చేసి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎంఈఓలు నివేదికలు ఇవ్వాలి. ఆ నివేదికల ప్రకారం ఏ స్కూల్‌కు గుర్తింపు ఉంది? ఏ స్కూల్‌కు లేదు అనే కచ్చితమైన సమాచారం విద్యాశాఖ అధికారుల దగ్గర ఉంటుంది.

NEET-UG 2024: నీట్‌ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

అయితే, ప్రతి ఏటా తనిఖీలు అంటూ విద్యాశాఖ అధికారులు చెప్పే మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలై పది రోజులు అయినా ఇంత వరకు ఒక్క ఎంఈఓ కూడా తనిఖీలు చేసినట్లు నివేదికలు ఇవ్వలేదు. పారదర్శక పాలన తీసుకరావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేసింది. అంతేకాకుండా మండలానికి అదనంగా మరో ఎంఈఓను నియమించింది. అడ్మినిస్ట్రేషన్‌, పర్యవేక్షణకు వేర్వేరుగా అధికారులను నియమించింది.

MBA And Diploma Programmes: ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

వారి విధులపై గత ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ఇంత వరకు పట్టించుకోలేదు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఆ ఫీజులకు తగ్గ సౌకర్యాలు ఉన్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలు కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా సదుపాయాలు లేకపోవడం గమనార్హం.

అనర్హులతో విద్యా బోధన

పాఠశాల ఏదైనా ఉపాధ్యాయులుగా పని చేసేందుకు కనీస విద్యార్హతలు ఉండాలని 2018 ఏప్రిల్‌ 4వ తేదీన ఆర్‌.సీ నెంబరు 118ని అప్పటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బీఈడీ, డీఈడీ అర్హతలతో పాటు కచ్చితంగా టెట్‌ అర్హత సాధించి ఉండాలి. ఆయా స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. అలాగే పీఎఫ్‌, గ్రాడ్యూటీని అందించాలి. ఈ విషయాలపై ఎంఈఓలు తనిఖీలు చేసి నివేదికలో పొందుపరచాల్సి ఉంది.

SEMS Olympiad : విద్యార్థులు సెమ్స్ ఒలంపియాడ్ ప‌రీక్ష‌తో ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి..

అయితే ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో తనిఖీలు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవాలకు పొంతనే లేదు. ప్రైవేట్‌ స్కూళ్లలో నోటీస్‌ బోర్డులు ఏర్పాటు చేసి.. ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో, స్కూల్లో ఎంత మంది ఏ విద్యార్హత ఉన్న టీచర్లుగా పని చేస్తున్నారో పొందుపర్చాల్సి ఉంది. అయితే ఇవి ఎక్కడా కనిపించడం లేదు. అనేక ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌, డిగ్రీ పూర్తి చేసిన వారే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.

ఆట స్థలాలు ఏవీ?

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు కచ్చితంగా ఆటస్థలాలు ఉండాలి. చాలా పాఠశాలలకు ఇవి లేకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే ఆయా యాజమాన్యాలు ప్రైమరీ తరగతుల పిల్లల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో పరిశీలించాల్సి ఉంది. అలాగే ఆటలు ఆడించేందుకు పీఈటీ టీచర్‌ ఉన్నారా? లేదా అనేది కచ్చితంగా ఎంఈఓలు చూడాలి. కానీ ఏ ఎంఈఓ కూడా వసతులపై నివేదికలు ఇవ్వలేదు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాల్సి ఉంది.

సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు

చర్యలు తీసుకుంటాం

జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలను మండల విద్యాధికారులు తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. తనిఖీ నివేదికలు ఆన్‌లైన్‌లో పంపించాలని ఓ నమూనా ఫాం కూడా అందజేశాం. దాని ప్రకారం సమాచారం తీసుకుంటున్నాం. కొన్ని స్కూళ్లకు గుర్తింపు ఉన్నా..అనుమతుల గడువు ముగిసింది. వాటిపై ఆయా ఎంఈఓల ద్వారా తనిఖీలు చేయించి, తేడాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించే స్కూల్‌కు గుర్తింపు ఉందో లేదో చూసుకోవాలి.

– కాగిత శామ్యూల్‌, డీఈఓ

Private and Govt ITI Counselling : ఐటీఐల్లో ప్ర‌వేశానికి కౌన్సెలింగ్ ముగిసింది.. సీటు రానివారి కోసం!

నిబంధనలు బేఖాతర్‌

జిల్లాలో మొత్తం ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు 738 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 203, ప్రాథమికోన్నత పాఠశాలలు 333, ఉన్నత పాఠశాలలు 202 ఉండగా.. మొత్తం 1,45,112 మంది విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్కూళ్లలో 5,424 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 1994లో విడుదల చేసిన జీఓ ఎం.ఎస్‌ నంబరు 01లోని 18వ నిబంధన ప్రకారం వసూలు చేసే ఫీజులో కేవలం 5 శాతం మాత్రమే నిర్వహణకు వ్యక్తిగతంగా వాడుకోవాలి. ఫీజులను నిర్ణయించేందుకు ఆ స్కూల్‌లో పేరెంట్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలి. వాటి ఆమోదంతోనే ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క స్కూల్‌ యాజమాన్యం కూడా నిబంధనలను పాటించడం లేదు.

Gurukula Teachers: గురుకుల టీచర్లకూ అవే సౌకర్యాలివ్వాలి

Published date : 25 Jun 2024 10:02AM

Photo Stories