SEMS Olympiad : విద్యార్థులు సెమ్స్ ఒలంపియాడ్ పరీక్షతో ఉన్నత స్థాయికి ఎదగాలి..
శ్రీకాకుళం: డాక్టర్ అబ్దుల్ కలాం స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్స్ నేషనల్ కో-ఆర్డినేటర్స్ ఏఆర్‌సీ రెడ్డి, ఎస్‌ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్న సిమ్స్ ఒలింపియాడ్ నేషనల్ టాలెంట్ టెస్ట్‌తో విద్యార్థులకు అపారమైన జ్ఞానం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం వరం రెసిడెన్సీలో జరిగిన అభినందన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయి ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులకు డీఈఓ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తితో పాటు వివిధ సబ్జెక్టులు సంబంధించి టాలెంట్ సెన్స్ ఒలింపియాడ్ నేషనల్ టాలెంట్ టెస్ట్ ద్వారా బయట పడుతుందన్నారు.
IAS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ బాధ్యతలు
ఇలాంటి సంస్థలు నిర్వహించిన టాలెంట్ సెర్చ్ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని మేధాశక్తిని తెలుసుకోవచ్చన్నారు. నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే సెమ్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో పాల్గొని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో గల వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను గురుబ్రహ్మ అవార్డుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ జ్ఞానేశ్వర్, సూర్యనారాయణ, మండల కోఆర్డినేటర్లు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ర్యాంకర్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Private and Govt ITI Counselling : ఐటీఐల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ముగిసింది.. సీటు రానివారి కోసం!