IAS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ బాధ్యతలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. దాదాపు 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖకు బదిలీ చేస్తూ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కాటా ఆమ్రపాలిను నియమించారు.
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌లు నియమితులయ్యారు. కార్మిక ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
- స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవి ఐఎఫ్ఎస్ నియామకం
- విద్యుత్ శాఖ సెక్రటరీగా రోనాల్డ్ రోస్ నియామకం
- విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ ఐపీఎస్.
- హెచ్ఎండిఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
- ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీగా హరిచందన
- టూరిజం ఎండిగా ప్రకాష్ రెడ్డి
- హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతమ్
- సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీగా అలుగు వర్షిని
- వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి
- ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా
- పొల్యూషన్ కంట్రోల్ సెక్రెటరీగా జీ.రవి
- ఫిషరీస్ డిపార్టుమెంట్ డైరెక్టర్‌గా ప్రియాంకా అలా
- టూరిజం డైరెక్టర్‌గా త్రిపాఠి
- డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్‌గా నరసింహారెడ్డి
- హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజ రామయ్య
- ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్
- ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సందీప్ కుమార్ సుల్తానియా
- కమర్షియల్ టాక్స్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ సెక్రటరీగా రజ్వీ
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్‌గా బుద్ధ ప్రకాష్
Published date : 25 Jun 2024 09:28AM