Private and Govt ITI Counselling : ఐటీఐల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ముగిసింది.. సీటు రానివారి కోసం!
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో మూడు ప్రభుత్వ, 20 ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 18 నుంచి ఆదివారం వరకు ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. చివరి రోజు 2304 ర్యాంకు నుంచి 2470 ర్యాంకు వరకు ప్రవేశాలు నిర్వహించగా, 165 మందికి 73 మంది హాజరయ్యారు. 34 మంది ప్రవేశాలు పొందారు. మొత్తం కౌన్సెలింగ్‌లో 634 మంది ప్రవేశాలు పొందారు. జిల్లాలోని 23 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 3608 సీట్లు ఉండగా, 2974 సీట్లు మిగిలిపోయాయి.
Gurukula Teachers: గురుకుల టీచర్లకూ అవే సౌకర్యాలివ్వాలి
దరఖాస్తు చేసి హాజరై సీట్లు రానివారు, హాజరు కాని వారికోసం ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రాధాన్యత గల ట్రేడుల్లో ప్రత్యేక రిజర్వేషన్లతో తప్ప, మిగతా సీట్లు నిండిపోయాయి. ప్రైవేట్ ఐటీఐల్లో తక్కువగా ప్రవేశాలు జరిగాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రవేశాల కన్వీనర్, ఎచ్చెర్ల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్‌రావు, ప్లేస్‌మెంట్ అధికారి కామేశ్వరరావు పర్యవేక్షించారు.
Tags
- ITI colleges
- admissions
- counselling
- selected students for iti counselling
- govt and private iti colleges
- students admissions at iti colleges
- Applications
- dates for iti counselling
- Education News
- Sakshi Education News
- iti admissions
- Etcherla Campus
- Counseling schedule
- Admissions process
- Second round counseling
- Admissions results
- Seat allocation
- sakshieducation updates