Skip to main content

RMF Rest: అమ్మల ప్రశాంతతకు ఆర్‌ఎమ్‌ఎఫ్‌.. దీని వినియోగం ఇలా..

అమ్మానాన్నా మాట్లాడుతున్నా సరే, వినకుండా విసురుగా వెళ్లిపోవడం వ్యంగ్యంగా మాటలు అనేయడం, నాటకీయంగా కళ్లు తిప్పడం ఉన్నట్టుండి తమ గదిలోకి వెళ్లి ‘ధఢేల్‌’న తలుపులు వేసుకోవడం ఇలాంటివెన్నో సంఘటనలు.
Resting option for Mother by meditation with RMF   Positive communication between parent and teenager

సాక్షి ఎడ్యుకేషన్‌: టీనేజ్‌ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ వాదనలు, గొడవలు తెలియని విషయలేమీ కాదు. ఒంటరి తల్లులకు పిల్లల పెంపకం మరింత కష్టంగా ఉంటుంది. పిల్లల చంచలమైన భావాలను నియంత్రించలేక తల్లులు చాలాసార్లు మౌనంగా మారిపోతుంటారు. ఇంట్లో టీనేజర్లు సృష్టించే యుద్ధ వాతావరణంలో ఎవరు గెలుస్తారో ప్రతి తల్లిదండ్రలకు తెలుసు కాబట్టి ఆర్‌ఎమ్‌ఎఫ్‌ మంత్రాన్ని మననం చేసుకోండి అంటున్నారు నిపుణులు.

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్ భారత్‌లో భాగమే..

రెస్ట్‌ మామ్‌ ఫేస్‌ (ఆర్‌ఎమ్‌ఎఫ్‌) అనే ఈ మంత్రం అమ్మ ముఖకవళికలను పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి, అందుకు తగిన సాధన ఏ విధంగా చేయాలో నిపుణులు చెబుతున్నారు. ‘టీనేజ్‌లో ఉన్న మా అమ్మాయి విషయంలో చాలాసార్లు నా ప్రవర్తన ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. చికాకు పరిచే సంఘటనలు ఎదురైనప్పుడు నా ఎమోషన్స్‌ని సమర్థంగా నియంత్రించలేక పోతుంటాను’ అంటుంది కార్పొరేట్‌ ఆఫీసులో హెడ్‌గా పనిచేసే కౌముది.

Women Success Story : ఇంట్లో ఉండే ప్రిపేర్‌ అయ్యా.. నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

‘మా అబ్బాయితో గొడవపడటం, పదే పదే చెప్పడం, గతంలో చేసిన ప్రామిస్‌లను గుర్తుచేయడం అదేపనిగా జరుగుతుంటుంది. కానీ, ఆ వెంటనే తప్పనిసరై నాకు నేనే తగ్గడం, మౌనంగా ఉండటం, లేదంటే సర్దిచెప్పడం. ఎప్పుడూ జరిగే పనే’ అంటుంది బొటిక్‌ను నడిపే వింధ్య.

Paper Leakage: ఎస్సెస్సీ ఉర్దూ పేపర్‌ లీకేజ్‌పై క్లారిటీ..

‘కుటుంబ ఆకాంక్షలను పిల్లలు తీర్చాలనే లక్ష్యంగానే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటోంది. తల్లులు టీనేజ్‌ పిల్లల విషయంలో తమను తాము నియంత్రించు కోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది హోలీ గ్రెయిల్‌ ఆఫ్‌ పేరెంటింగ్‌ మ్యాగజైన్‌. ఎలాంటి భావోద్వేగాలను ముఖంలో చూపని తటస్థ స్థితిని రెస్టింగ్‌ మామ్‌ ఫేస్‌ సాధన చేస్తే సరైన ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతోంది. అదెలాగో చూద్దాం.

Intermediate Public Exams 2024: ఇంటర్‌ మూల్యాంకన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని .....

తటస్థంగా..
సాధారణంగా ఎలాంటి వ్యక్తీకరణ లేని స్త్రీ ముఖాన్ని చూసిన వాళ్లు అహంకారమనో లేదా నిరాడంబరత అనో నిర్ధారించుకుంటుంటారు. సంతోషించే సమయంలోనూ వీరు ‘తటస్థ’ ముఖాలతో ఉండటం చూస్తుంటాం. చూసేవారికి వీరి ముఖాల్లో ప్రశాంతత కూడా కనిపిస్తుంటుందని పరిశోధకులు గ్రహించారు. అందరూ ఇలా ఉండలేరు. కానీ, పిల్లల ముందు తమ భావోద్వేగాలను బయటకు చూపకుండా తమని తాము నిభాయించుకుంటూ ఉండాలంటే ప్రాక్టీస్‌ అవసరం.

Collector Warning: ఈ ప‌రీక్ష‌ల‌పై.. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

విశ్రాంతికి 30 సెకన్లు
అమ్మల ముఖం పిల్లల ముందు సరైన విధంగా ఉండాలంటే,ఫేస్‌ యోగాను సాధన చేయాలి.
కోపంగా ఉన్న పిల్లలతో మాట్లాడేముందు ముఖ కండరాలకు కూడా విశ్రాంతి అవసరం అని తమకు తాముగా చెప్పుకోవాలి. రెండు పిడికిళ్లతో ముఖాన్ని రుద్దుకుంటున్నట్టు, కోపాన్ని కూల్‌ చేసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. గాఢంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. అయితే, అది ఎదుటివారికి నిట్టూర్పులా ఉండకూడదు. మీ ముఖ కండరాలలో చికాకు, ఆశ్చర్యం, విమర్శిం చడం. వంటివన్నీ తీసేసి, స్పష్టంగా అనుకున్న విషయాన్ని చెప్పేయాలి.

Hostel Inspection: హాస్టల్‌ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి..

చిన్నపిల్లలు యుక్తవయసులో ఉన్నా, పెద్దవారైనప్పుడైనా ఈ ఆర్‌ఎమ్‌ఎఫ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. నిజాయితీగా ఈ వ్యూహాన్ని అమలుపరిస్తే ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయి. గొడవ పడే సమయాల్లో ఎలాంటి బోధలు చేయద్దు. అలాగే శిక్షించవద్దు. పిల్లలు వారి భావోద్వేగాలను స్వీయ – నియంత్రణ చేయగలిగేలా చేయడమే లక్ష్యంగా ఉండాలి.
మీ బిడ్డ తన ఆందోళనను, అసంతృప్తిని మరింత ఆమోదయోగ్యమైన మార్గాల్లో వ్యక్తపరచలేకపోతే అకస్మాత్తుగా దాడికి దిగవచ్చు. లేదంటే తనని తాను బాధించుకోవచ్చు. అందుకని సమస్యను కూల్‌గా పరిష్కరించాలి.

AP EAPCET 2024 New Schedule : బ్రేకింగ్ న్యూస్‌.. AP EAPCET 2024 పరీక్షల షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు ఇవే.. అలాగే ఈ ప‌రీక్ష‌లు కూడా..

బంధాలు పదిలం..
‘తల్లి మెరుగైన ఆలోచనతో ఉంటే పిల్లలతో స్నేహాలను, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోగలదు. కానీ, నియంత్రణతో సరైన ప్రయోజనాలను రాబట్టలేరు’ అంటారు సైకాలజిస్ట్‌ అండ్‌ పేరెంటింగ్‌ రైటర్‌ అలిజా. పిల్లల ఆకలి తీరినప్పుడు వారి కోపం చల్లబడుతుంది. అందుకని వారికి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందిస్తుండాలి. దీంతో పిల్లల దృష్టి మారిపోతుంది. కానీ, అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్‌ఎమ్‌ఎఫ్‌ని సాధన చేయడమే మేలు అనేది నిపుణుల మాట.

Jobs with Study: ప్రభుత్వ కళాశాలలో కేరీర్‌ ప్లానింగ్‌పై కార్యశాల

Published date : 22 Mar 2024 03:28PM

Photo Stories